తిరుపతికి వెళ్లే వారికి గమనిక... ఈ విషయాలు తెలుసుకోండి...?

Reddy P Rajasekhar
దేశంలో కరోనా మహమ్మారి ఉగ్ర రూపం దాలుస్తోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ ప్రభావం తిరుపతిపై కూడా పడింది. ఇప్పటికే తిరుపతిలో లాక్ డౌన్ అమలవుతుండగా లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు‌ పొడిగిస్తున్నట్లు తాజాగా కీలక ప్రకటన చేశారు. అధికారులు ఈ నెల 31 వరకు తిరుపతిలో లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయని అధికారులు తెలిపారు.
 
మెడిక‌ల్ షాపులు, అత్యవసర సేవలకు మాత్రం అనుమతులు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత తిరుపతిలోకి వాహనాలను అనుమతించరు. అధికారులు వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోందని అందువల్ల ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. క‌రోనా వైరస్‌ తీవ్ర‌త ఎక్కువగా ఉండటం వల్ల ప్ర‌తి ఒక్క‌రూ నిబంధ‌న‌లు పాటించి సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
 
లాక్ డౌన్ అమలు చేస్తున్నా తిరుపతిలో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. జులై నెల 21 నుంచి తిరుపతిలో లాక్ డౌన్ అమలవుతోంది. అధికారులు పట్టణంలో మాస్కులు ధరించని వారికి భారీగా జరిమానాలు విధిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో నమోదవుతున్న కేసుల్లో తిరుపతిలో నమోదవుతున్న కేసులే అధికంగా ఉన్నాయి. కరోనా మహమ్మారి ప్రభావం తిరుమలపై కూడా పడింది. టీటీడీ ఉద్యోగులు, అర్చకులు వైరస్ బారిన పడుతున్నారు.
 
ఇప్పటికే టీటీడీ ఉద్యోగులు, అర్చకులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటివరకు తిరుమలలో 750 మంది కరోనా బారిన పడ్డారు. తిరుపతిలో లాక్‌డౌన్‌ను విధించడం వల్ల తిరుమలకు వచ్చే భక్తులనూ నియంత్రించినట్టవుతుందనే అభిప్రాయాలు అధికారుల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు వాహ‌నాల్లో తిరుమ‌ల‌కు వెళ్లేవారు బైపాస్ రోడ్ మార్గం ద్వారా వెళ్లాల‌ని ఎస్పీ సూచించారు. చిత్తూరు జిల్లాలో నిన్న ఒక్కరోజే 959 పాజిటివ్ కేసులు.. 10 మరణాలు నమోదయ్యాయి. కేసుల సంఖ్య పెరగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: