ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత..? లెంపలేసుకున్న ప్రముఖ జర్నలిస్ట్..!?

Chakravarthi Kalyan
ఆయనో ప్రముఖ జర్నలిస్టు.. దేశం మొత్తం ఫేమస్.. మంచి క్రెడిబిలిటీ ఉన్న పాత్రికేయుడు.. అలాంటి వ్యక్తి ఓ ట్వీట్ పెట్టారంటే అది నిజమేనుకుంటారు. అది కూడా మామూలు వార్త కాదు.. మాజీ రాష్ట్రపతి కన్నుమూశారన్నవార్త. ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారంటూ ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్.. ఓ ట్వీట్ పెట్టారు. వాస్తవానికి ప్రణబ్ ముఖర్జీ చనిపోలేదు. కానీ పొరపాటున తనకు వచ్చిన సమాచారాన్ని రాజ్‌దీప్ సర్దేశాయ్ ట్వీట్ ద్వారా పంచుకున్నారు.

కానీ ఆ తర్వాత తెలిసింది అది ఫేస్ న్యూస్ అని. కానీ ట్వీట్ పెట్టింది రాజ్‌ దీప్ సర్దేశాయ్ కావడంతో ఈ వార్త వెంటనే పాకిపోయింది. ఆ తర్వాత తప్పు తెలుసుకున్న రాజ్ దీప్ ఆ పోస్ట్ డెలీట్ చేసి.. సారీ చెప్పేశారు. తనకు వచ్చిన సమాచారాన్ని క్రాస్ చెక్ చేసుకోకుండా పొరపాటున ట్వీట్ చేశానని..ఇది దిద్దుకోలేని తప్పు అంటూ విచారం వ్యక్తం చేశారు. ఇది ఏమాత్రం ప్రొఫెషనలిజం కాదని.. తాను ఇలా చేసి ఉండకూడదని వ్యాఖ్యానించారు.  

ఇలాంటి తప్పు చేసినందుకు తనను క్షమించాలంటూ ఆయన క్షమాపణలు కోరారు. ప్రణబ్ ముఖర్జీ కోలుకోవాలంటూ ప్రార్థించారు. ఇక అసలు విషయం ఏంటంటే.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ  ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని దిల్లీలోని ఆర్మీకి చెందిన రీసెర్చ్‌, రెఫెరల్‌ ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆయనను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రణబ్‌కు సోమవారం శస్త్రచికిత్స జరిగింది. అయితే మంగళవారం ఆయన ఆరోగ్యం మరింత విషమించింది.

బుధవారం నాటికి కూడా ఆయన పరిస్థితిలో పెద్దగా పురోగతి కనిపించలేదు. గతేడాది ఆగస్టు 8న ప్రణబ్ ముఖర్జీ  భారతరత్న అవార్డు పొందారు. సరిగ్గా ఏడాది తర్వాత ఆగస్టు 10న ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడం ఆయన కుటుంబంలో విషాదం నింపింది. ప్రణబ్‌ ముఖర్జీ త్వరగా కోలుకోవాలని దేశమంతా కోరుకుంటోంది. ఆయన సేవలు గుర్తు చేసుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: