దారుణం : భార్యకు కరోనా అని తెలిసి.. భర్త ఛీ.. ఛీ..?
బెంగుళూరు లో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జెపి నగర శంకరమఠ వార్డులో గౌరీ మంజునాథ దంపతులూ ఉంటున్నారు. రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఉత్తర కర్ణాటక నుంచి ఉపాధి కోసం వచ్చిన ఈ దంపతులిద్దరూ జేసీ నగర ప్రాంతంలో జీవిస్తున్నారు. గౌరీ ఓ బట్టల షాప్ లో సేల్స్ ఉమెన్ గా చేస్తుండగా భర్త ఆటో డ్రైవర్. అయితే ఇటీవలే గౌరీ అనారోగ్యం బారిన పడటంతో కొన్ని రోజుల వరకు వేచి చూసిన భర్త మంజునాథ్ తర్వాత ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు వారిని ఇంటికి పంపారు. తర్వాత ఆమెకు కరోనా పాజిటివ్ అంటు భర్తకు సమాచారం అందించారు.
దీంతో భార్య పక్కనే ఉన్న భర్త కరోనా పాజిటివ్ అని తేలడంతో.. వెంటనే కట్టుకున్న భార్యను వదిలేసి అక్కడినుంచి మాయమయ్యాడు, ఇక ఆ మహిళకు శ్వాస కోశ సంబంధ వ్యాధి ఎక్కువ కావడంతో... కరోనా వైరస్ భయంతో చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ముందుకు రాలేదు దీంతో విలవిలలాడుతోనే ప్రాణాలు వదిలింది గౌరీ, చివరికి స్థానిక కార్పొరేటర్ యజమాని కూడా ఫోన్ చేసిన భర్త స్విచాఫ్ చేసి పెట్టుకున్నట్లు తెలుస్తోంది. బంధువులకు ఫోన్ చేస్తే మమ్మల్ని కాదని ప్రేమ పెళ్లి చేసుకున్న రోజే వారితో బంధం తెగిపోయింది అంటూ తెగేసి చెప్పేశారు. దీంతో చేసేదేమీ లేక మునిసిపాలిటీ సిబ్బంది సదరు మహిళకు అంత్యక్రియలు జరిపించారు.