మొన్న అమిత్ షా.. నేడు మాజీ రాష్ట్రపతి.. ఎవరిని వదలని కరోనా..?

praveen
దేశంలో రోజురోజుకీ కరోనా  వైరస్ శరవేగంగా వ్యాప్తిచెందుతున్న  విషయం తెలిసిందే. ఒకప్పుడు అతి తక్కువ కేసులు ఉన్న దేశంగా ఉన్న భారత్ ప్రస్తుతం మాత్రం రికార్డు స్థాయి కేసులతో... ఏకంగా 20 లక్షల మార్కును దాటేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎంతో మంది ప్రజలు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. అయితే ప్రజలందరూ కరోనా  వైరస్ బారిన పడుతుండటం ఒక ఎత్తయితే... ప్రజలకు రక్షణ కల్పిస్తూ... ఎప్పటికప్పుడు అవగాహన పెంచుతూ... ధైర్యం నింపుతున్న  ప్రజాప్రతినిధులు సైతం కరోనా  వైరస్ బారిన పడుతుండటం ప్రస్తుతం సంచలనంగా మారింది. మొన్నటి వరకు కేవలం రాష్ట్ర ఎమ్మెల్యేల వరకు మాత్రమే ఉన్న ఈ కరోనా  వైరస్ ప్రభావం మొన్నటికి మొన్న ఏకంగా దేశ హోంమంత్రి అమిత్ షా  వరకూ వెళ్లడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.




 తాజాగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కరోనా వైరస్ బారిన పడ్డారు... అనారోగ్యం బారిన పడిన ప్రణబ్ ముఖర్జీ  ఇతర పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లగా.. సిబ్బంది కరోనా  పరీక్షలు కూడా నిర్వహించారు  ఇక ఈ పరీక్షలో తనకి పాసిటివ్ అని  వచ్చినట్లు... ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అయితే గత కొన్ని రోజుల నుండి తనతో సన్నిహితంగా ఉన్న వారు తనను కలిసిన వాళ్ళందరూ కూడా వెంటనే అప్రమత్తమై కరోనా  వైరస్ పరీక్షలు నిర్వహించుకోవాలని తగిన జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. లేదా ఐసోలేషన్ లో ఉండాలి అంటూ సూచించారు.



 అయితే ఇలా రోజురోజుకు సెలబ్రిటీలు నాయకులు అధికారులు సైతం కరోనా వైరస్ బారిన పడుతుండటం అటు ప్రజల్లో మరింత భయాందోళనలు పెంచుతోంది. ధైర్యం చెప్పి అవగాహన కల్పించే వారే  ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడుతుండటం తో సామాన్యుల పరిస్థితి ఏంటి అని భయపడి పోతున్నారు ప్రజలు. ప్రస్తుతం కేవలం రోజుల వ్యవధిలోనే దేశం లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యి లక్షల  కేసులు దాటిపోతున్న తరుణంలో... వాక్సిన్ వస్తే గానీ ప్రస్తుతం దేశంలో పరిస్థితులు సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఇప్పటికే రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రులు దేశాన్ని పాలించే హోంమంత్రి లాంటి వాళ్ళు కరోనా  వైరస్ బారిన పడుతున్న తరుణంలో పరిస్థితులు ఎక్కడ వరకు దారి తీస్తాయి అర్థం కాని పరిస్థితి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: