కరోనా వైరస్ గురించి మరో షాకింగ్ న్యూస్... ?

Reddy P Rajasekhar
భారత్ లో కరోనా వైరస్ విలయం కొనసాగుతోంది. ప్రతిరోజూ 60,000కు పైగా కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో నగరాల్లోనే పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదు కాగా ప్రస్తుతం పల్లెల్లో సైతం భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ బారిన పడుతున్నామని పలువురు బాధితులు చెబుతున్నారు. తాజాగా ఈ వైరస్ గురించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.
 
వైద్యులు కరోనా వైరస్ ఊపిరితిత్తులు, గుండెపై మాత్రమే ప్రభావం చూపదని శరీరంలోని అణువణువును వైరస్ ప్రభావితం చేస్తోందని చెబుతున్నారు. తల మొదలుకొని పాదాల వరకు శరీరంలోని అనేక అవయవాలపై వైరస్ ప్రభావం ఉంటుందని... శరీరంలో వైరస్ దాడి గురించి ప్రజలు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్నా ఈ వైరస్ వల్ల శరీరానికి కలుగుతున్న నష్టం అపారం అని... ప్రజలు వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
 
కిడ్నీలు, మెదడు లాంటి కీలక అవయవాలపై సైతం వైరస్ ప్రభావం పడుతోందని వైద్యులు చెబుతున్నారు. బయటి నుంచి శరీరంలోని చేరిన కరోనా వైరస్ మొదట నాసికా రంధ్రాల్లో తిష్ట వేస్తుందని... ఆ తర్వాత ముక్కు నుంచి గొంతులోకి అక్కడి నుంచి ఊపిరితిత్తులు, గుండెలోకి విస్తరిస్తుందని చెబుతున్నారు. కరోనా రోగుల్లో కొంతమంది ఆకస్మికంగా మరణిస్తున్నారని... ఈ మరణాలకు మయో కార్డైటీస్ కారణమని చెబుతున్నారు.
 
ప్రజలు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించి, తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే వైరస్ సోకకుండా కాపాడుకునే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. మరోవైపు ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లోనే ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆగష్టు నెలలో అమెరికా, బ్రెజిల్ తో పోలిస్తే మన దేశంలోనే ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం గమనార్హం. గత కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సైతం కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: