నూతన విద్యా విధానం 2020 : మోదీ ఐడియాను ప్రశంసిస్తున్న ఫారిన్ యూనివర్సిటీలు...?

Reddy P Rajasekhar
కేంద్ర కేబినెట్ బుధవారం రోజున ఉన్నత విద్యలో సంస్కరణలు అమలు చేస్తూ నూతన విద్యా విధానం-2020కి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. కేబినెట్ కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ పేరును కేంద్ర విద్యా శాఖగా మార్చింది. నూతన విద్యా విధానంలో పిల్లల రిపోర్ట్ కార్డులలో సబ్జెక్టులకు వచ్చిన మార్కులు మాత్రమే కాకుండా వారి ఇతర నైపుణ్యాలకు కూడా మార్కులు ఇస్తారు. ప్రస్తుతం 10+2 విద్యా విధానం అమలవుతుండగా ఇకపై 5+3+3+4 విద్యా విధానం అమలవుతుంది.
 
నూతన విద్యా విధానంలో పిల్లలు తమకు నచ్చిన కోర్సులను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. అన్ని కోర్సులకు రెండు భాషల్లో బోధన ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు పరిమితికి మించి ఏ ఉన్నత విద్యా సంస్థ ఎక్కువ వసూలు చేసేందుకు వీలు ఉండదు. మోదీ విద్యా విధానంలో సంచలన మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేయడంపై ఫారిన్ యూనివర్సిటీలు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నాయి.
 
కొత్త విద్యా విధానం వల్ల మన దేశానికి అనేక ఫారిన్ యూనివర్సిటీలు వచ్చే అవకాశం ఉంది. నూతన విద్యా విధానానికి విదేశీ యూనివర్సిటీల నుంచి అద్భుతమైన స్పందన వ్యక్తమవుతూ ఉండటంతో హార్వర్ద్, ఆక్స్ ఫర్డ్ వంటి ప్రఖ్యాత విదేశీ విశ్వవిద్యాలయాలు భారత్ లో క్యాంపస్ లను తెరిచే అవకాశం ఉంటుంది. మోదీ ప్రభుత్వం ఈ విద్యా విధానం ద్వారా కొత్త ఒరవడికి నాంది పలికిందని చెప్పవచ్చు.
 
ఫ్రాన్స్ కు చెందిన బిజినెస్ స్కూల్ మేనేజర్ నూతన విద్యా విధానం గురించి మాట్లాడుతూ మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం విద్యలో భారీ సంస్కరణలను తీసుకొస్తుందని చెప్పారు. ఈ విధానం వల్ల నాణ్యమైన విద్య, కరిక్యులమ్ లో మార్పులు చోటు చేసుకుంటాయని అన్నారు. నూతన విద్యా విధానం 2020 వల్ల విద్యలో సరికొత్త మార్పులు రానున్నాయి. కొత్త విద్యా విధానం టెక్నాలజీ ఆధారిత విద్యపై ఎక్కువగా ఫోకస్ చేయనుందని అసోసియేషన్ ఆఫ్ కామన్ వెల్త్ యూనివర్సిటీల ప్రతినిధి ఆదిత్య మల్కాని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: