వామ్మో.. జయలలిత ఇంట్లో ఎన్ని కేజీల బంగారం, వెండి బయటపడ్డాయో తెలుసా...?

Chakravarthi Kalyan

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె ఇంటిని స్మారక నిలయంగా మార్చాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన  ప్రక్రియ అంతా పూర్తి చేస్తోంది. అందులో భాగంగానే ఆమె ఇంటిపై ఉన్న పన్నుల బకాయలన్నీ ప్రభుత్వం ఇటీవల కట్టేసింది కూడా.

 


అయితే ఆమె ఇంటిపై ఇటీవల ఓ ఆసక్తికరమైన కథనం వెలుగు చూసింది. ఆమె నివాసమైన  వేద నిలయంలో చాలా బంగారు, వెండి వస్తువులు బయటపడ్డాయట. ఇటీవల ఆ ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోగా మొత్తం 8,376 వస్తువులు ఆ ఇంటిలో ఉన్నాయని గుర్తించారట. జయలలిత ఇంట్లో దొరికిన  ఆ వస్తువుల్లో  పెద్ద ఎత్తున ఆభరణాలు లభించాయట. 

 


ఆ లెక్కల వివరాలు చూస్తే.. 14 కేజీల బంగారు ఆభరణాలు, 600 కేజీల 867 వెండి వస్తువులు ఉన్నాయట. ఇవి కాకుండా ఇంకా ఆరు వేల అలంకరణ వస్తువులు, 556 ఫర్నీచర్ వస్తువులు.. 30 వరకూ ఫోన్లు దొరికాయట. ఇంకో షాకింగ్ వాస్తవం ఏంటంటే. ఆమె వస్త్రాలు ఏకంగా  10 వేలకు పైగా ఉన్నాయట. ఇప్పుడు వీటన్నింటినీ అదె ఇంట్లో ఆమె జ్ఞాపకార్థం నిర్వహించబోయే మ్యూజియంలో ఉంచాలని ప్లాన్ చేస్తున్నారట. 

 


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆజన్మ బ్రహ్మాచారిణి అన్న విషయం తెలిసిందే. కానీ.. ఆమెకు విలాసవంతమైన జీవితం అంటే చాలా ఇష్టం. ఆమె గతంలో తన పెంపుడు కొడుకు సుధాకర్ పెళ్లికి చేసిన ఖర్చు, హంగామా ఓ రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఆమె ఇంట్లో బయటపడిన వస్తువులు కూడా రికార్డు సృష్టించేలా ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: