స్త్రీ ఆకారంలో బొమ్మ వేసి... ఆపై క్షుద్రపూజలు...!

Suma Kallamadi

క్షుద్రపూజలు మరోసారి నెల్లూరు జిల్లాలో ప్రజలని భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. కొందరు వ్యక్తులు క్షుద్ర పూజలు చేస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నారు. అయితే ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా ఉదయగిరి లోని కావలి రోడ్డు వెంట ఉన్న అడవి ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ క్షుద్ర పూజలు నిర్వహించారు. అర్ధరాత్రి సమయంలో అడవిలో ఓ ప్రాంతంలో స్త్రీ ఆకారంలో ఉన్న ముగ్గును వేసి ఆపై ముగ్గు మధ్యలో ఓ యువతి ఫోటో ఉంచి పూజలు చేశారు. 

 

అంతేకాకుండా ఆ పూజలు చేసిన ప్రాంతంలో కుంకుమ, పసుపు, కొబ్బరికాయలు, గుమ్మడికాయ లాంటి వాటిని ఉపయోగించి క్షద్ర పూజలు నిర్వహించారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ ప్రాంతంలోని ఓ మేకలకాపరి కంట పడడంతో, ఆ విషయాన్ని కాస్త సదరు గ్రామస్తులతో చర్చించాడు. చివరికి ఆ విషయం ఆ నోట ఈ నోట చేరి పోలీసులకు సమాచారాన్ని అందించాడు. దీంతో ఉదయగిరి ప్రజలలో తీవ్ర భయాందోళనలు చోటు చేసుకున్నాయి.

 


ఇలాంటి పూజలు నిర్వహించిన వారిని కఠినంగా శిక్షించాలని ఆ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీస్ రక్షణ బృందం ఆ ప్రాంతంలో అధిక మొత్తంలో భద్రతను ఏర్పాటు చేసి, క్షద్ర పూజలు నిర్వహిస్తున్నది ఎవరో కనుక్కోవడానికి వివిధ వర్గాలుగా పోలీసులు క్షుణ్ణంగా విచారిస్తున్నారు.

 

ఓవైపు ప్రపంచం ఆధునీకరణ విషయంలో ఎంతో ముందుగా అభివృద్ధి చెందుతుంటే... మరోవైపు మనదేశంలో ఇలాంటి క్షుద్రపూజల నేపథ్యంలో అమాయక ప్రజలను మోసం చేస్తూ కొందరు దొంగ బాబాలు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. నిజంగా ఇలాంటి విషయాలను చూసినపుడు నిజంగా మనం ఇంకా అనాగరికుల కాలంలో ఉన్నామా అన్నట్లు అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: