"భజే భాయు వేగం" కి 2 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు కార్తికేయ తాజాగా భజే వాయు వేగం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మే 31 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందు ప్రేక్షకుల్లో ఈ మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు లేవు. దానితో ఈ మూవీ చాలా తక్కువ థియేటర్లలో , తక్కువ అంచనాల నడుమ విడుదల అయింది. ఇక ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు కలెక్షన్ లు భారీగా పెరిగాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. అందులో భాగంగా ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్ లు వచ్చాయి. ఈ మూవీ ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్లను సాధిస్తే హిట్  స్టేటస్ ను అందుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం.
రెండు రోజుల్లో ఈ మూవీ కి నైజాం ఏరియాలో 60 లక్షల కలెక్షన్ లు దక్కగా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 70 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రెండు రోజుల్లో 1.30 కోట్ల షేర్ ... 2.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక ఈ మూవీ కి రెండు రోజుల్లో కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లో కలుపుకొని 25 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకి రెండు రోజుల్లో 1.55 కోట్ల షేర్ ..  3.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి నాలుగు కోట్ల మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ మరో 2.45 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా సాధించినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్మలా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: