కరోనా దెబ్బ : చెట్టు కిందే అసెంబ్లీ.. ఇలా దేశంలోనే తొలిసారి ?

Chakravarthi Kalyan

కరోనా యమా డేంజర్.. ఇప్పుడు అందరినోటా వినిపిస్తున్న మాట ఇది. అందులోనూ 50 ఏళ్ల పైబడి వారు ఇంకా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి రాజకీయ నాయకులు అంటే సహజంగానే 50ఏళ్లు దాటిన వాళ్లు ఎక్కువగా ఉంటారు. అందుకే వారు కరోనా విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. 

 

 


అందుకే పుదుచ్చేరి అసెంబ్లీ సమావేశాలను ఏకంగా ఆరుబయట చెట్టుకింద పెట్టేశారు. ఎందుకంటే.. అసెంబ్లీలోని  ఆల్‌ ఇండియా ఎన్‌.ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎన్‌.ఎస్‌.జె. జయబాల్‌ కు కరోనా నిర్థరణ అయ్యింది. ప్రస్తుతం పుదుచ్చేరిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. జయబాల్ కు కరోనా వచ్చిందని తెలియగానే.. స్పీకర్ అలర్ట్ అయ్యారు. 

 


అసెంబ్లీ ప్రధాన భవనాన్ని మూసేయించారు. దాన్ని పూర్తిగా శానిటైజేషన్ చేయిస్తున్నారు. అయితే కీలకమైన బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందువల్ల... అసెంబ్లీని వాయిదా వేసేందుకు వీలు లేకుండా పోయింది. అందుకే.. అసెంబ్లీ బయట ఓ చెట్టుకింద టెంట్లు వేసి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేశారు. 

 


జయబాల్‌ తో నేరుగా కాంటాక్ట్‌ ఉన్న ఎమ్మెల్యేలను ఇప్పటికే  హోంక్వారంటైన్ కు పంపించేశారు. దేశంలో ఇలా అసెంబ్లీ సమావేశాలు ఆరుబయట నిర్వహించడం ఇదే తొలిసారి అంటున్నారు. సోమవారం నాటికి బడ్జెట్‌ను ఆమోదించి అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేయనున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: