అన్నగారి మనవడిగా మాట ఇస్తున్నా.... అక్కడ విగ్రహం ఏర్పాటు అవుతుంది... చినబాబోరు సంచలన ట్వీట్లు...?
ఇటీవల నెల్లూరు జిల్లా కావలి దగ్గర ముసునూరు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా విగ్రహం తొలగింపు గురించి సంచలన ట్వీట్లు చేశారు. లోకేశ్ తన ట్వీట్లో కావలి నియోజకవర్గం ముసునూరు గ్రామంలో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని వైకాపా నాయకులు తొలగిస్తుండగా అడ్డుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలతో తాను మాట్లాడానని అన్నారు.
జగన్ సర్కార్ ఐదుగురు టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతోందని... బాధితులతో మాట్లాడి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చానని అన్నారు. ఆ తారకరాముడి విగ్రహం తీసిన చోటే మళ్లీ ఏర్పాటవుతుందని... అన్నగారి మనవడిగా తాను మాట ఇస్తున్నానని పేర్కొన్నారు. గత కొంతకాలంగా నారా లోకేష్ ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.
ట్విట్టర్ వేదికగా అధికార పార్టీ పనితీరును ఎండగడుతూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు మరియు కార్యకర్తలతో టచ్ లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడంతో పాటు పార్టీ అభివృద్ధి కోసం కీలక సూచనలు చేస్తున్నారు. ముసునూరులోని మహాలక్ష్మమ్మ ఆలయ స్థలంలో ఆలయానికి ఎదుట రెండేళ్ల క్రితం ఓ టీడీపీ నేత ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
అయితే ఆ విగ్రహాన్ని అధికార పార్టీ నేతలు తొలగించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం అక్కడ ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. అయితే స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి బాలకృష్ణకు వాస్తవ పరిస్థితులను తెలియజేశారు. రాజమండ్రి నుంచి కొత్తగా కొనుగోలు చేసిన ఎన్టీఆర్ విగ్రహం ముసునూరుకు చేరుకుందని... ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.
తీసిన చోటే ఆ తారకరాముడి విగ్రహం మళ్లీ ఏర్పాటు అవుతుంది. ఇది అన్నగారి మనవడు ఇస్తున్న మాట.(2/2) — lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) July 25, 2020