చైనా కి కొత్త శత్రువు.. స్ట్రాంగ్ వార్నింగ్.. తరిమి తరిమి కొట్టారు..?
చైనా వ్యవహారము ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఒకటా రెండా ప్రతి దేశం తో కూడా చైనా సరికొత్త వివాదానికి తెర లేపుతోంది..అన్ని దేశాలతో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తుంది. . చైనా విస్తరణవాదం ప్రస్తుతం చైనా కి ముప్పు తెచ్చేలా కనిపిస్తోంది. దేశం ఏదైనా సరే కనిపించిన భూభాగమల్ల తమదేనంటూ చైనా దురాక్రమణకు పాల్పడుతున్న నేపథ్యంలో అన్ని దేశాలు క్రమక్రమంగా ఒక్కటై పోతున్నాయి. రోజుకు చైనాకు శత్రువు దేశాల సంఖ్య ఎంతగానో పెరిగిపోతుంది.ఇప్పటికే చైనాకు పలు దేశాలు వార్నింగ్ ఇస్తున్న విషయం తెలిసిందే.
ముఖ్యంగా చైనా యుద్ధ నౌకకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మొన్నటికి మొన్న జపాన్ సముద్ర జలాలు తమవి అంటూ చెప్పగా.. బుద్ధి చెప్పేందుకు భారీ సంఖ్యలో యుద్ధ నౌకలను రంగంలోకి దింపింది జపాన్. ఓవైపు ఫిలిప్పీన్స్ వైపు వెళ్లినా అక్కడ కూడా యుద్ధ నౌకల తో వార్నింగ్ ఇచ్చారు.. ఇక తైవాన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన చైనాకు హెచ్చరికలు జారీ చేశారు... మొన్న భారత్ కూడా చైనా కు సంబంధించిన అణు యుద్ధనౌకను తరిమి తరిమి కొట్టింది. వరుసగా చైనాకు వివిధ దేశాల సైన్యాల నుంచి హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి.
ఇక తాజాగా చైనా శత్రు దేశాల జాబితాలో మరో దేశం కూడా చేరిపోయింది. ఆస్ట్రేలియా యుద్ధనౌకలు ప్రస్తుతం చైనా కు బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యాయి. ఫిలిపెన్స్ దగ్గర ఉన్న యుద్ధనౌక దగ్గరికి చైనా యుద్ధనౌక వచ్చిన సమయంలో ఆస్ట్రేలియా యుద్ధ నౌకా ఏకంగా ఆయుధాలను ఎక్కుపెట్టి... వార్నింగ్ ఇచ్చింది. ఇలా చైనా విస్తరణ వాదం ఏకంగా చైనా కి రానున్న రోజుల్లో ముప్పు తెచ్చిపెట్టేలా కనిపిస్తుంది. ప్రపంచంలోని పెద్ద దేశాలు అన్ని ఒక్కటవుతున్న తరుణంలో చైనా మాత్రం విస్తరణవాదంతో ఒంటరి పోరాటం చేస్తోంది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అన్నది చూడాలి.