కరోనా గుడ్‌న్యూస్ : నవంబర్ తర్వాత బలహీనపడనున్న కరోనా...?

Chakravarthi Kalyan

కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో రోజూ వేల సంఖ్యలో కేసులు వస్తున్నాయి. అయితే ఈ కరోనా నవంబర్ తర్వాత బలహీన పడుతుందని.. దీని గురించి ఎక్కువగా భయపడవద్దని.. అమెరికాకు చెందిన ఓ భారతీయ వైద్య నిపుణులు చెబుతున్నారు. చికాగో యూనివర్శిటీలో  మెడిసిన్, సర్జరీ విభాగంలో ఇన్ఫెక్షియస్ డిసీజెస్‌ నిపుణుడైన డాక్టర్ విజయ్ ఎల్దండి  ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. 

 

 


కరోనా వైరస్ ను ముందుగా గుర్తిస్తే అది ప్రాణాంతకరం కాదు, ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని డాక్టర్ విజయ్ చెబుతున్నారు. జ్వరం లేదా కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని .. త్వరగా సంప్రదిస్తే ప్రాణాపాయం ఉండదని ఆయన భరోసా ఇస్తున్నారు. ఆక్సిజెన్ లెవెల్స్ ఎప్పటికప్పుడు పరీక్ష చేయించుకుంటూ ఉంటే మేలని సూచిస్తున్నారు. 

 


కరోనాకు విరుగుడుగా పరిశుభ్రత పాటించాలని, మాస్క్ తప్పని సరిగా వాడాలని అప్పుడే వ్యాప్తిను అడ్డుకొగలమని డాక్టర్ విజయ్ అంటున్నారు. కరోనా వ్యాప్తి గురించి ఎక్కువగా భయపడ వద్దని..  వ్యాప్తి తప్పదని ఆయన అంటున్నారు. ఆగస్టు, నవంబర్ లో కేసులు పతాక స్థాయికి చేరతాయంటున్న ఆయన ఆ తర్వాత తగ్గుముఖం పడతాయని చెబుతున్నారు. 

 

 


కరోనా అంటేనే ప్రజలు భయపడుతున్నారని, ఈ విషయంలో ధైర్యంతో, ఆత్మ విశ్వాసంతో ఉండాలని డా. విజయ్ సూచించారు. కాలానుగుణంగా కరోనా వ్యాప్తి తప్పదంటున్న ఆయనమొదటి దశలో ఆగస్టు వరకు పతాక స్థాయికి చేరుకుని.. ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు.  ఆ తర్వాత తిరిగి నవంబర్ నెలలో రెండో దశ ప్రభావం చూపుతుందని.. ఇది బలహీన దశ అని విజయ్ అంచనా వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: