చైనా లక్ష్యానికి అడ్డుగా భారత్.... ఏం జరిగిందంటే...?

Reddy P Rajasekhar

చైనా భారత్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టినా ఒక దేశం విషయంలో మరో దేశం కఠినంగా వ్యవహరిస్తోంది. భారత్ ఇప్పటికే చైనాను ఆర్థికంగా దెబ్బ కొట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనే పరిస్థితులు గతంలో కనిపించటంతో భారత్ యుద్ధ విమానాలను, సరికొత్త ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. ఇప్పటికే చైనా యాప్ లపై నిషేధం విధించిన భారత్ ఆ దేశం కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంది.                  
 
వాస్తవానికి ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చలాయించాలని చైనా భావిస్తోంది. అమెరికా వ్యతిరేక దేశాలను ఏకం చేయడంతో పాటు సముద్రాలపై ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చైనా అనుకుంటోంది. అయితే చైనా లక్ష్యానికి భారత్ అడ్డుగా మారింది. తూర్పున ఫసిపిక్ మహాసముద్రం నుంచి దక్షిణాన హిందూ మహాసముద్రం వరకు 30 లక్షల చదరపు కిలోమీటర్ల వరకు దక్షిణ చైనా సముద్రం వ్యాపించి ఉంది. 
 
ఈ సముద్రం తీరప్రాంతంలో చైనాతో పాటు మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, వియత్నాం, కాంబోడియా, థాయిలాండ్ ఉన్నాయి. ఈ సముద్రంలో 213 బిలియన్ టన్నుల చమురు నిల్వలు, 3.6 బిలియన్ క్యూబిక్ మీటర్ల సహజవాయువుల నిల్వలతో పాటు ప్రపంచంలోని మత్స్యసంపదలో పది శాతం ఉంది. వీటిన్నటిపై ఆధిపత్యం ప్రదర్శించాలని చైనా భావిస్తోంది. అమెరికాను ఢీ కొట్టాలంటే ఆర్థికంగా పుంజుకోవడంతో పాటు అన్ని విధాలుగా బలపడాలని భావిస్తోంది. 
 
కరోనా విషయంలో చైనా సేఫ్ గేమ్ ఆడుతోందని... వైరస్ కట్టడికి సంబంధించిన సమాచారాన్ని ప్రపంచ దేశాలకు తెలీకుండా దాస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చైనా ఆధిపత్యానికి భారత్ అడ్డుగా నిలుస్తుండగా ప్రపంచ దేశాలు సైతం మన దేశానికే మద్దతు ప్రకటిస్తున్నాయి. గాల్వన్ ఘర్షణ జరగకపోతే భారత్  చైనాను  ఇంత తీవ్రస్థాయిలో వ్యతిరేకించేది కాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: