హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ డిమాండ్ ఎంత పడిపోయిందంటే..?

Chakravarthi Kalyan

హైదరాబాద్.. తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి అనుబంధం ఉన్న నగరం.. ఇప్పటికీ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని హోదా ఇంకా ఉంది కూడా. ఈ రెండు రాష్ట్రాల్లో  హైదరాబాద్‌తో బంధమో, అనుబంధమో లేని కుటుంబాలు చాలా తక్కువ. హైదరాబాద్ లో సొంత స్థలమో, ఇళ్లో తీసుకోవడం చాలా మంది జీవిత కాల స్వప్నం కూడా. 

 

అయితే కరోనా అన్ని రంగాలనూ దెబ్బ తీసినట్టే హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌నూ బాగానే దెబ్బ తీసింది. వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ కారణంగా రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ ఏకంగా ఓ పదేళ్లు వెనక్కు వెళ్లినట్టు అయ్యిందట. అంటే దీని అర్థం పదేళ్ల క్రితం నాటి ధరలు ఉన్నాయని కాదు.. పదేళ్ల క్రితం నాటికి డిమాండ్ పడిపోయిందన్నమాట.

 


ఆ అధ్యయనం కొన్ని  గణాంకాలనూ వివరిస్తోంది. జనవరి నుంచి జూన్‌ వరకు జరిగిన గృహాల అమ్మకాలు ఏకంగా 43శాతం పడిపోయాయట. అలాగే కొత్తగా చేపట్టాల్సిన ఇంటి నిర్మాణాలు 19శాతం మేర తగ్గాయట. అంటే హైదరాబాద్‌లో ఈ పరిస్థితుల్లో ఇళ్లు, స్థలాలు కొనేవారి సంఖ్య గతంతో పోలిస్తే.. సగానికి సగం తగ్గిపోయందన్నమాట.

 

 

అయితే ఇక్కడే ఓ తిరకాసు ఏంటంటే..  
రియల్ ఎస్టేట్ రంగం గ్రోత్ బాగా  తగ్గింది కానీ ఆ స్థాయిలో ధరలు మాత్రం తగ్గలేదని అదే సర్వే వివరించింది.  ధరల పెరుగుదల ఏడు శాతం ఉన్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: