ఆవుకి, రక్షాబంధన్ కి సంబంధం ఏంటి.. ఇంత అసహ్య ప్రచారమా..?

praveen

భారతదేశంలో రాఖీ పండుగ కి ఎంతటి ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అన్న చెల్లెల అనుబంధానికి ప్రతీకగా మన పూర్వికులు నుండి వచ్చిన అతి గొప్ప పండుగలలో ఒకటి రాఖీ పండుగ. అన్న చెల్లెలు ఎంత దూరంగా ఉన్నా రాఖీ పండగ కి మాత్రం తప్పకుండా కలుసుకుంటారు. తమ్ముళ్ళకి అన్నలకి ఇంటి ఆడపిల్లలు రాఖీలు కట్టడం ప్రతి ఏడు జరుగుతూనే ఉంటుంది. ఇలా ప్రతి సంవత్సరం తమ సోదరులకు రాఖీ కడుతూ అక్క చెల్లెలు ఎంతో ఆనందంగా ఈ పండుగ జరుపుకుంటారు. ఎంత దూరం ఉన్నప్పటికీ సకుటుంబం మొత్తం ఒకచోట చేర్చే పండుగ రాఖీ పండుగ అని చెప్పవచ్చు. అయితే తాజాగా ఇలాంటి రాఖీ పండుగ పై పెటా  ఒక వింత వాదన  మొదలుపెట్టింది.

 

 వాస్తవంగా అయితే పర్యావరణ జీవకారుణ్య సంఘాలు.. ఓవైపు పర్యావరణం పరిరక్షణ కోసం మరో వైపు మూగజీవాల రక్షణ కోసం ఎంతో తెగించి పని చేస్తూ ఉంటాయి.  స్వచ్ఛందంగా సమాజం మీద ప్రేమతోనే వాళ్ళు ఎలాంటిది ఆశించకుండా మనస్ఫూర్తిగా పని చేస్తారు. కానీ ఇటీవలే రాఖీ పండుగ పై పెట చేస్తున్న ప్రచారం మాత్రం ఎంతో వింతగా ఉంది అనే చెప్పాలి. రాఖీ పండుగ జరుపుకోవడం ద్వారా.. గో చర్మానికి సమస్య వస్తుందట. రాఖీలు గో చర్మం నుంచి తయారు చేస్తున్నారు అన్నటువంటి తాజాగా ఓ  వాదనను తెరమీదకు తెచ్చింది పెటా. 

 

 మామూలుగా అయితే రాఖీలు ఏదో ఒక దారం దూదితో తయారు చేసినవి కడుతూ ఉంటారు. ఎక్కడ కూడా గో చర్మానికి రాఖీ పండగకి అసలే సంబంధం లేదు. ఒకవేళ నిజంగానే రాఖీలను గో చర్మంతో తయారు చేస్తే అసలు వాటి జోలికి కూడా వెళ్లరేమో ఆడపిల్లలు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా పెట తెరమీదకు తీసుకువచ్చిన సరికొత్త వాదన మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. ఓవైపు ఆవుల వధ  చేస్తూ... మేకలను కూడా చంపేస్తూ ఉంటే పట్టించుకోని పెటా... హిందువుల పండుగల విషయంలో మాత్రం ఎప్పుడూ ఏదో ఒక వాదన తెరమీదకు చేస్తూ ఉంటుంది అంటూ విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: