వైసీపీలోకి అఖిల ప్రియ ?

Satya

అఖిల ప్రియ. భూమా నాగిరెడ్డి శోభానాగిరెడ్డి రాజకీయ వారసురాలు.  గారాల పట్టి. ఆమె తల్లిదండ్రుల జీవిత కోరిక మంత్రి కావాలని, కానీ వారికి తీరని కోరిక కూతురుగా అఖిల ప్రియ తీర్చింది. ఆమె మంత్రిగా నాటి చంద్రబాబు మంత్రివర్గంలో చేరింది. కొన్నాళ్ళు జిల్లా రాజకీయాలను శాసించింది. సరే అదంతా గతం అనుకుంటే ఇపుడు ఆమె ఓడింది. ప్రతిపక్షంలో కూడా ఉంది. అయినా కూడా కర్నూల్ జిల్లా రాజకీయాల్లో  ఆమె హవా సాగుతోంది.

 

భూమా నాగిరెడ్డి స్నేహితునిగా, సన్నిహితునిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి తో ఆమె రాజకీయ,  కుటుంబ వైరాన్ని కొనసాగిస్తోంది. ఏవీ సుబ్బారెడ్డి కూడా టీడీపీనే. ఈ ఇద్దరినీ బాబు ఆనాడు పార్టీలోకి తీసుకుని   అకాడిడేట్ చేశారు. నామినేటెడ్ పదవి సుబ్బారెడ్డ్డికి దక్కితే మంత్రిగా అఖిలప్రియ ఉన్నారు.

 

సరే ఇపుడు ఇద్దరూ మాజీలే, ఒకే పార్టీలో ఉన్నా కూడా ఇద్దరూవ్యక్తిగత  గొడవ పడుతున్నారు. తనను చంపించడానికి అఖిలప్రియ సుపారీ ఇచ్చిందని సుబ్బారెడ్డి ఆరోపిస్తున్నారు. దీని మీద మూడు నెలల క్రితమే ఆయన కడప పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇప్పటికి కొందరిని అరెస్ట్ చేసినా కూడా ఏ 4, ఏ 5లను అలాగే ఉంచేశారని తాజాగా కడప ఎస్పీని కలసి మరీ మరోసారి ఫిర్యాదు చేసారు.

 

ఈ కేసులో ఏ 4గా ఉన్న  అఖిలప్రియను ఎందుకు అరెస్ట్ చేయరు అన్నది సుబ్బారెడ్డి ప్రధాన ఆవేదన.  ఆమె నుంచి తనకు ముప్పు ఉందని,  ఆమెను అరెస్ట్ చేయమని సుబ్బారెడ్డి గట్టిగా విన్నవించుకుంటున్నాడు, గోడు పెడుతున్నాడు. అయితే ఇక్కడ ఉన్నది వైసీపీ సర్కార్. పైగా భూమా అఖిలప్రియ టీడీపీ, ఫిర్యాదు చేసిన సుబ్బారెడ్డి టీడీపీ. కేసు కట్టి అరెస్ట్ చేసే సదుపాయం ఉంది. చాలా క్లియర్ గా ఇక్కడ సీన్ కనిపిస్తున్నా కూడా జగన్ సర్కార్ అఖిలప్రియను ఎందుకు అరెస్ట్ చేయడం లేదన్న డౌట్లు కర్నూల్ జిల్లా  రాజకీయ వర్గాల్లోనూ వస్తున్నాయి.

 

నిజానికి టీడీపీ  మాజీ మంత్రులను వరసగా వైసీపీ జైలు దారి చూపిస్తోంది. అలాంటిది అఖిలప్రియ విషయంలో ఎందుకు ఇలా చేస్తోంది. ఆమె వైసీపీలో చేరుతారా ఏంటి అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఆమె తొలిసారి గెలిచింది కూడా వైసీపీ టికెట్ మీదనే. మరి అందుకేనా ఆమె విషయంలో వైసీపీ ఇలా చేస్తోంది అంటున్నారు. అలా కనుక కాకపోతే ఈ కేసులో ఏనాడో అఖిలప్రియ అరెస్ట్ ని చూపిచవచ్చు కదా అని అంటున్నారు. మరి అఖిలప్రియ వైసీపీలో చేరుతుందా, లేక జగన్ సర్కార్ కి ఆమె మీద సాఫ్ట్ కార్నర్ ఏమైనా ఉందా. ఇవన్నీ సందేహాలే.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: