జీవిత సత్యాలు: నీ భవిష్యత్ అంతా దీనిపైనే ఆధారపడి ఉంది...!?

Chakravarthi Kalyan

రేపు మీ జీవితంలో ఏం జరుగుతుందనేది.. ఈరోజు మీ ఆలోచనను బట్టే ఉంటుంది. మీ ఆలోచనలు సానుకూలంగా సాగితే.. భవిష్యత్తు దివ్యంగానే ఉంటుంది. మనకు సొంతం కాని వాటిపై అత్యాశ  మంచిది కానే కాదు.. అలాగే మనకు సొంతం ఐన వాటి పై నిర్లక్ష్యమూ సరికాదు.. 

 


జీవితం అసంతృప్తిగా సాగడానికి ఈ అత్యాశ, నిర్లక్ష్యం రెండూ కారణాలుగా మారతాయి. అలాగే మన ఉన్నతి కోసం మనం ప్రయత్నిస్తూనే... మన జీవితంలో ఏం జరిగినా దాన్ని స్వీకరించే మనస్తత్వం అలవాటు చేసుకోవాలి. అన్నీ మనకు అనుకూలంగానే జరగవన్న సత్యాన్ని జీర్ణించుకోవాలి. 

 


మన జీవితంలోకి కొందరు దీవెనల్లా వస్తారు. మరికొందరు పాఠాల్లా వస్తారు. మన జీవితం పరిపూర్ణమవ్వాలంటే అందరినీ సమానంగా స్వీకరించాలి. ఉన్నత స్థానాల కోసం ప్రయత్నిస్తూనే మనకు ఉన్న దాన్ని ఆస్వాదించడమూ నేర్చుకోవాలి. 

 

 


ఎందుకంటే.. సంపదలెన్ని ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థం.. పూరి గుడిసె బతుకైనా కంటి నిండా నిదురపోయే మనిషి జీవితం ధన్యం. అందుకే మీకు ఉన్నదాంతో సంతృప్తి పొందండి.. మరింత ఉన్నత శిఖరాలు అందుకునేందుకు ప్రయత్నించండి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: