వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా..... ఇవి తీసుకుంటే వైరస్ ను జయించడం ఖాయం....?
దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. వైరస్ విజృంభణ మొదలైన తొలి రోజు నుంచి రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. వైరస్ ఇప్పుడిప్పుడే కనుమరుగయ్యే పరిస్థితి కనిపించటం లేదు. అందువల్ల వైరస్ భారీన పడకుండా ఉండాలంటే భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రత పాటించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. విటమిన్ డి, విటమిన్ సి ఉన్న ఆహారాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారు.
ఆస్ట్రేలియాకు చెందిన క్యాన్సర్ వ్యాధి నిపుణులు రాబెల్ నీల్ కరోనా నుంచి బయటపడాలంటే వైరస్ సోకిన వాళ్లు కూడా కనీసం పది నిమిషాలైనా ఎండలో ఉండాలని చెబుతున్నారు. విటమిన్ డి తక్కువగా ఉన్నవారిలో వైరస్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటే మాత్రమే కరోనా సోకినా వైరస్ నుంచి బయటపడటం సాధ్యమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఉదయం సమయంలో చర్మంపై సూర్యకిరణాలు పడితే డి విటమిన్ ఉత్పత్తి జరుగుతుంది. డి విటమిన్ రోగ నిరోధక శక్తితో పాటు ఎముకల ధృడత్వానికి సహాయపడుతుంది. ఆహారం, గుడ్లు, కాలేయం, కాడిఫ్లవర్ ఆయిల్ ద్వారా కూడా డీ విటమిన్ లభిస్తుంది. నిమ్మజాతి పండ్ల నుంచి సీ విటమిన్ ప్రధానంగా లభిస్తుంది. సీ విటమిన్ నారింజ, నిమ్మ, బత్తాయి, ఉసిరి, చెర్రీ, జామ, ఆకుకూరల్లో సమృద్ధిగా ఉంటుంది.
ఈ రెండు విటమిన్లతో పాటు విటమిన్ ఈ కు కూడా ఇన్ఫెక్షన్లతో పోరాడగలిగే సామర్థ్యం ఉంది. పిస్తా, మొలకెత్తిన గింజలు, గుమ్మడి విత్తనాలు, వేరుశెనగలలో ఈ విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది. వీటితో పాటు నిమ్మరసంలో తేనె కలుపుకుని పరగడుపున సేవిస్తే రోగనిరోధక శక్తితో పాటు చురుకుదనం పెరుగుతుంది. రోజుకు రెండు నుంచి మూడు కప్పుల గ్రీన్ టీ తాగితే అన్ని విధాలా ఆరోగ్యకరం.