టిక్ టాక్ బ్యాన్ సక్సెస్ కావాలంటే భారతీయులు ఏం చేయాలో తెలుసా....?

Reddy P Rajasekhar

భారత్ లో టిక్ టాక్ యాప్ కు ఉన్న ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. ఎంతోమంది ఈ యాప్ ద్వారా సెలబ్రిటీలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ యాప్ కు దేశంలో కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అయితే అదంతా గతం... గల్వాన్ ఘటన అనంతరం భారత్ లో చైనాతో పాటు చైనా యాప్స్ పై కూడా ద్వేషం అంతకంతకూ పెరిగింది. చాలామంది నెటిజన్లు టిక్ టాక్ యాప్ కు తక్కువ రేటింగులు ఇచ్చారు.
 
కేంద్రం కూడా చైనా విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ టిక్ టాక్ తో పాటుగా 59 యాప్ లపై నిషేధం విధించింది. టిక్ టాక్ యాప్ ను ఇప్పటికే గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించటంతో పాటు సర్వీసులు కూడా నిలిపివేయబడ్డాయి. అయితే టిక్ టాక్ బ్యాన్ సక్సెస్ కావాలంటే నెటిజన్లు ఏం చేయాలనే విషయాలను టెక్ నిపుణులు సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. అయితే కొన్ని మార్గాల ద్వారా టిక్ టాక్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 
 
కేంద్రం గూగుల్, యాపిల్ సంస్థలను కోరడంతో టిక్ టాక్ తో సహా ఇతర యాప్ ల సర్వీసులు నిలిపివేయబడ్డాయి. భారతీయులు ఈ యాప్స్ ను ఎట్టి పరిస్థితుల్లోను ఇతర మార్గాల ద్వారా డౌన్ లోడ్ చేసుకుని వినియోగించకుండా ఉంటే మంచిదని వాళ్లు చెబుతున్నారు. అలా వినియోగిస్తే భవిష్యత్తులో చట్టపరమైన ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
చైనా యాప్స్ ను వినియోగిస్తే మన డేటా కూడా ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్లు అభిప్రాయపడుతున్నారు. భారతీయులంతా కేంద్రం నిబంధనలను అనుసరించి పూర్తిస్థాయిలో శ్రమిస్తే మాత్రమే టిక్ టాక్ బ్యాన్ సక్సెస్ అవుతుంది. ఇప్పటికే బ్యాన్ అయిన యాప్స్ విషయంలో ప్రజలు కూడా కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: