13 హత్యలు.. 50 అత్యాచారాలు.. ఎన్నో దొంగతనాలు.. ఇది ఆ నేరస్థుడు ట్రాక్ రికార్డు..?

praveen

30 ఏళ్లుగా నేరాలకు పాల్పడుతూ ఉన్నాడు... ఎన్నో హత్యలు మరెన్నో అత్యాచారాలు... కానీ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు, చివరికి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ వరుస హత్యలు అత్యాచారాలకు పాల్పడుతున్న నిందితుడు పోలీసుల ముందు తన నేరాలను అంగీకరించాడు. మూడు దశాబ్దాలుగా కాలిఫోర్నియాకు భయ బ్రాంతులకు గురి చేస్తున్న జోసెఫ్ అనే వ్యక్తికి  కోర్టు శిక్ష విధించింది. ఇక ఈ విచారణలో సదరు నేరస్తుడు గత ముప్పై ఏళ్ల నుంచి పాల్పడిన ఘోరమైన నేరాలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది కోర్టు

 


 ప్రస్తుతం జోసఫ్ వయస్సు 74 ఏళ్లు, గత 30 ఏళ్ల నుంచి నేరాలకు పాల్పడు తూ పోలీసుల కు చిక్కకుండా తప్పించు కు తిరుగుతున్నాడు. ఇక ఇటీవలే కోర్టు విచారణ సమయంలో నేరాలకు సంబంధించి అవును అంటూ నేరాన్ని అంగీకరించాడు. ఈ క్రమం లో గతం లో జోసెఫ్ కు  విధించిన మరణ శిక్షను రద్దు చేస్తూ... పెరోల్ కు అనుమతి లేకుండా పదకొండేళ్ల జీవిత శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది కోర్టు. మూడు దశాబ్దాల నుంచి నేరాల కు పాల్పడుతున్న జోసెఫ్ ని 2018లో అరెస్టు చేశారు పోలీసులు. 

 

 నేరం జరిగిన ఘటన లో దొరికినది డీఎన్ఏ  ఆధారంగా జోసఫ్ ను అరెస్ట్ చేశారు.... ఇక గత మూడు దశాబ్దాల నుంచి జోసెఫ్ చేస్తున్న నేరాలకు అడ్డుకట్ట పడింది అని చెప్పాలి. ఎంతో మంది ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మొదటిసారిగా 1978 లో నూతన జంట ను హత్య చేసిన కేసు లో కోర్టు శిక్ష విధించింది. కాగా తాజాగా కోర్టు లో మరో సంచలన నిజాలు బయటపడ్డాయి. 30 సంవత్సరా ల్లో  13 హత్యలు 50 అత్యాచారాలు పదుల కొద్దీ దొంగతనాలకు పాల్పడినట్లు  నేరాన్ని అంగీకరించాడు ఈ కరడుగట్టిన నేరస్థుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: