వలస కూలీలకోసం సరికొత్త పథకాన్ని ప్రారంభించిన కేంద్రం.. పూర్తి వివరాలు..?

praveen

కరోనా  వైరస్ కష్టకాలంలో అందరినీ ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకొని ఏకంగా 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే 20 లక్షల కోట్ల ప్యాకేజీ లో గ్రామీణ భారతదేశంలో జీవనోపాధి అవకాశాలను పెంచే లక్ష్యంతో గరీబ్  కళ్యాణ్  రోజ్గార్  అభియాన్ అనే మహత్తర కార్యక్రమాన్ని 50 వేల కోట్లతో ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం 11 గంటలకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిబ్  కళ్యాణ్  రోజ్గార్ అభియాన్  ప్రారంభించారు. ప్రత్యేకంగా కరోనా  కష్టకాలంలో చితికిపోయిన వలస కార్మికులకు సహాయం చేయడమే దీని  ముఖ్య లక్ష్యం. 

 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గరీబ్  కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ పథకం ఒక భారీ గ్రామీణ ప్రజా వనరుల పథకం. ఇది ఇతర రాష్ట్రాలలో ఉపాధి కోసం వెళ్లి ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో సొంత రాష్ట్రాలకు తిరిగివచ్చిన వలస కార్మికులకు మరియు పౌరులకు...సాధికారత మరియు జీవన ఉపాధి అవకాశాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. నూట ఇరవై ఐదు రోజుల్లో 116 జిల్లాలకు ప్రభుత్వానికి చెందిన దాదాపు 25 పథకాలను ఈ పథకం కింద తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం. 

 

 ఆరు రాష్ట్రాల లోని 116 జిల్లాలోని గ్రామాలు కామన్ సర్వీస్ సెంటర్లు కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఈ కార్యక్రమంలో చేరనున్నారు వలస కార్మికులు. ఇక ఈ పథకం ద్వారా లబ్ధి పొందే ఆరు రాష్ట్రాలు బీహార్,  ఉత్తరప్రదేశ్,  మధ్యప్రదేశ్, రాజస్థాన్,  జార్ఖండ్ మరియు ఒడిశా రాష్ట్రాలు ఉన్నాయి. ఈ ఆరు రాష్ట్రాలలో కరోనా  వైరస్ కష్టకాలంలో ఉపాధి లేక స్వస్థలానికి తిరిగివచ్చిన 25,000 మంది వలస కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకంలో భాగంగా ఉద్యోగాల కల్పన మరియు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి 25 రకాల పనులను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. 

 


 గ్యాస్ పైప్ లైన్లు, నైపుణ్య అభివృద్ధి శిక్షణ, ఖనిజ నిధి  కింద పనులు, వ్యర్థ పదార్థాల నిర్వహణ జీవనోపాధికి ముఖ్యమైన ఇతర కార్యకలాపాలు వలస కార్మికులకు అందించేందుకు ఈ 25 రకాల పనులను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.అంగన్వాడీ కేంద్రాలు గ్రామీణ రహదారులు,  గ్రామీణ గృహాలు, రైల్వే పనులు,  పట్టణ ప్రాంతాల ఆకృతిని తీసుకుంటున్న గ్రామీణ ప్రాంతాల్లోని అర్బన్ మిషన్, సోలార్ పంప్ సెట్,  ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ వేయడం, జల్ జీవన్  సహా మరికొన్ని ఈ  25 పనులలో
 చేర్చబడ్డాయి.

 

 ఇటు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా.. గ్రామాభివృద్ధి,  పంచాయతీరాజ్, రహదారి రవాణా మరియు రహదారులు గనులు తాగునీరు మరియు పర్యావరణం రైల్వేలు పెట్రోలియం మరియు సహజవాయువు, ఇంధనం సరిహద్దు రోడ్లు టెలికాం సహా 12 రకాల  మంత్రిత్వ శాఖల సమన్వయం తో సాగుతుంది. 15వ ఆర్థిక కమిషన్ సిఫారసు చేసిన గ్రామీణ స్థానిక సంస్థలకు డబ్బు విడుదల చేయడంతో అభియాన్ గ్రామాల కాంతలకు ఆస్తులు కల్పన సహ గ్రామీణ అభివృద్ధికి శక్తిని ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గరీబ్ కళ్యాణ్ రోజ్గార్  అభియాన్....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: