తెలంగాణలో మళ్లీ లాక్ డౌన్ పై క్లారిటీ ఇచ్చిన ఈటెల రాజేందర్..!!

KSK

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొద్దీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయటపడటంతో ప్రజలలో భయాందోళనలు మొదలయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ మరియు పరిసరాల జిల్లాలలో ఎక్కువగా కరోనా ప్రభావం ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఆయా నియోజకవర్గాలలో కరోనా నిర్ధారణ పరీక్షలు భారీ స్థాయిలో జరిపించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు మరియు ప్రజా ప్రతినిధులకి కూడా కరోనా వైరస్ సోకుతున్న తరుణంలో ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం రెడీ అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో  ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా కరోనా టెస్టులకు కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా టెస్టులకు 2200 రూపాయలు ధర నిర్ణయించడం జరిగిందని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. వెంటిలేటర్ లేకుండా చికిత్స చేస్తే రోజుకు 7500 రూపాయలు తీసుకోవచ్చు. వెంటిలేటర్ ద్వారా చికిత్స చేస్తే తొమ్మిది వేల రూపాయల చార్జీ తీసుకోవచ్చని అన్నారు. బెంగుళూరు లో కరోనా టెస్టుకు 4500 రూపాయలు వసూలు చేస్తున్నారని, తెలంగాణలో తగ్గించి ఆదేశాలు ఇచ్చామని ఈటెల రాజేందర్ అన్నారు.

అంతా ICMR ఇచ్చిన ఆదేశాల ప్రకారం మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో కరోనా వ్యాధి నిరోధక చర్యలు చేపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ ఉంటుందని వస్తున్న వార్తలలో వాస్తవం లేదని, మరోసారి లాక్ డౌన్ చేపట్టేది లేదని ఈటెల క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో సామాజిక వ్యాప్తి జరగలేదని, పెద్ద ప్రమాదకర స్థాయిలో వైరస్ వ్యాప్తి లేదని ఈటెల రాజేందర్ చెప్పుకొచ్చారు.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: