సైబర్ నేరగాళ్లు ఉన్నారు ...! మీ అకౌంట్స్ లోని డబ్బులు జాగ్రత్త సుమా ...!

Suma Kallamadi

ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరగాళ్ల బరిలో చాలా మంది అభాగ్యుల మోసపోతున్నారు. సైబర్  నేరగాళ్ల చేతుల్లో పడి లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ఇదే తరుణంలోనే ఒక కన్స్ట్రక్షన్ వ్యాపారి నుంచి 50 లక్షల వరకు సైబర్ నేరగాళ్లు దోచేశారు. అమీర్ పేట కు చెందిన ఒక కన్స్ట్రక్షన్ వ్యాపారి సెల్ ఫోన్ పని చేయలేదు. దీనితో అతను సెల్ ఫోన్ నెట్వర్క్ ప్రొవైడర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక ఈ విషయంపై ప్రొవైడర్ మీ నెంబర్ తో ఒక కొత్త  సిమ్ తీసుకున్నారని అతనికి తెలియజేశారు. దీంతో అనుమానం వచ్చి వ్యాపారి తన బ్యాంకు ఖాతాను పరిశీలన చేయగా పశ్చిమబెంగాల్ లోని ఒక బ్యాంకు ఖాతాలోకి 50 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అయినట్లు అర్థమయింది.  

 


ఇక పూర్తి వివరాల్లోకి వెళితే హైదరాబాద్ లోని అమీర్ పేటకు చెందిన ఒక కన్స్ట్రక్షన్ వ్యాపారి బ్యాంకు ఖాతాతో పాటు సెల్ ఫోన్ నెంబర్ ను హ్యాక్ చేసి సైబర్ నేరగాళ్లు 50 లక్షల రూపాయలు దోచేశారు. అంతేకాకుండా సైబర్ నేరగాళ్లు సదరు వ్యక్తి  సెల్ ఫోన్ కి ఓటిపి లు రాకుండా వారి ఆధీనంలో తీసుకొని... ఆ వ్యక్తి బ్యాంకు ఖాతాల్లో నుంచి డబ్బులు బెంగాల్ లోని తమ ఖాతాలోకి బదిలీ చేసుకున్నారు. ఇలాంటి సంఘటనలు జరగడంలో సైబర్ క్రైమ్ పోలీస్ అధికారులు అప్రమత్తం అయ్యారు.

 


కొత్త టెక్నాలజీతో సెల్ ఫోన్ లకు ఓటిపి లు రాకుండా మెసేజ్ చేయడంతో పోలీసులకు  అంతుచిక్కని విషయంగా మారింది. సదరు వ్యాపారి వ్యక్తి వెంటనే బ్యాంకుకు వెళ్లి తగిన వివరాలు తెలుసుకోక ఒకసారి 30 లక్షలు, మరోసారి 20 లక్షలు... ఇతర ఖాతాలకు ట్రాన్స్ఫర్ అయినట్లు బ్యాంకు అధికారులు తెలియజేశారు. పశ్చిమ బెంగాల్ లోని ఐసిఐసిఐ బ్యాంకు ఖాతాలకు ట్రాన్స్ఫర్ అయినట్లు అధికారులు ఆ వ్యాపారికి తెలియజేశారు. దీనితో ఆ బాధితుడు క్రైమ్ పోలీస్ అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనితో వారు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. అంతేకాకుండా ఫిర్యాదు అందగానే పశ్చిమబెంగాల్ లోని ఐసిఐసిఐ బ్యాంకు అధికారులకు ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ కాల్ చేసి ఆ డబ్బును సంబంధిత ఖాతాల్లో నుంచి డ్రా చేయకుండా చూడాలి అంటూ కోరడం జరిగింది. కానీ అప్పటికే ఆ డబ్బు మొత్తం సైబర్ నేరగాళ్లు విత్ డ్రా చేశారు అని బ్యాంకు అధికారులు అతనికి సమాధానం ఇచ్చారు. దీనితో సదరు వ్యక్తుల కోసం పోలీసులు తీవ్ర గాలింపు చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: