20 డాలర్లకే తన సోదరుడిని చంపడం ఎంత వరకు భావ్యం? : జార్జ్ ఫ్లాయిడ్ సోదరుడి ఆవేదన

Edari Rama Krishna

అమెరికాలో జార్జ్‌ ఫ్లాయిడ్‌ మరణం ఎంత సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే. తాజాగా జార్జ్‌ ఫ్లాయిడ్‌ మరణం ఆయన సోదరుడు మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు.  కేవలం 20 డాలర్ల కోసమే ఆయనను చంపడం భావ్యమా? అంటూ ప్రశ్నించారు జార్జీ ఫ్లాయిడ్‌ సోదరుడు ఫిలోనిస్‌ ఫ్లాయిడ్‌. పోలీసుల అదుపులో జార్జ్‌ ఫ్లాయిడ్‌ మరణించిన రెండు వారాల అనంతరం అమెరికా ప్రతినిధుల సభ జ్యుడిషియరీ కమిటీ తొలిసారి సమావేశమై విచారించింది.  కాగా, ఈ వ్యవహారంపై అమెరికా ప్రభుత్వం ప్రజాప్రతినిధులతో ఓ కమిటీ వేసింది. ఈ కమిటీ ముందు జార్జ్ ఫ్లాయిడ్ సోదరుడు ఫిలోనిస్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫిలోనిస్ కన్నీటి పర్యంతమవుతూ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ కదిలించాయి. 

కేవలం 20 డాలర్ల కారణంగా తన సోదరుడు మరణించడం భరించలేని విషయం అన్నారు. తన సోదరుడు ఎవ్వరినీ గాయ పర్చలేదు.. దూషించలేదని అన్నారు. ఓ నల్లజాతి వ్యక్తి ప్రాణం ఖరీదు 20 డాలర్లా అన్నది ఆలోచించాల్సిన విషయం అని తెలిపారు. నల్లవారు కూడా మనుషులేనని, కానీ తన సోదరుడు బాధతో విలవిల్లాడుతూ సాయం కోరితే ఎవరూ స్పందించలేదని ఫిలోనిస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

 

జార్జీని చంపాల్సిన అవసరం పోలీసులకు ఏమున్నది?  సహకరించమని వేడుకొన్న కనికరించలేదు. ఆయన ఆవేదన ప్రస్తుతం అమెరికా అంతటా ప్రతిధ్వనిస్తున్నాయి. మీరూ వినండి... అని చట్టసభ సభ్యుల ఎదుట చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు.  ఇప్పటికైనా వర్ణవివక్ష రూపుమాపండి అంటూ పిలుపునిచ్చారు. తన సోదరుడి మరణం వృధా పోకుండా చూడాల్సిన బాధ్యత యావత్ ప్రపంచంపై ఉందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: