ఓవైపు కరోనా విజృంభిస్తున్నా మరోవైపు జనంలో ఆ స్పృహ మాత్రం కనిపించడం లేదు. జనం గుంపులు గుంపులుగా బయటకు వస్తూనే ఉన్నారు. కనీసం మాస్కు, భౌతిక దూరం అన్న కాన్సెప్టులు కూడా పట్టించుకోవడం లేదు. ఇలాంటి సమయంలో కరోనా విజృంభణ మరింత జోరందుకునే ప్రమాదం ఉంది. ఈ నిర్లక్ష్యంలో అన్ని వయస్సుల వారికీ వాటా ఉంది.
విచిత్రం ఏంటంటే.. దీని ఫలితం మాత్రం కొందరే అనుభవిస్తున్నారు. కేవలం కొన్ని వయస్సుల వారే దీనికి మూల్యం చెల్లించుకుంటున్నారు.. అవును నిజం.. కరోనా ఎక్కువగా 40 ఏళ్ల పైబడి వారిలోనే ఎక్కువగా వస్తోందని గణాంకాలు, అనేక దేశాల అనుభవాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ కరోనా వచ్చిన వారిలో అత్యధికులు నడి వయస్సు వారేనట. అందుకే ఇకపై ఈ ఏజ్ గ్రూప్ వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఓవైపు లాక్‌డౌన్ నిబంధనల సడలింపులతో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే మరణాల సంఖ్యా పెరిగే అవకాశం ఉంది. అందుకే వైరస్ బారిన పడటాన్ని తగ్గించగలిగితేనే మృతుల సంఖ్య తగ్గుతుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. వయస్సు తక్కువ ఉన్నవారికి కరోనా సోకినా ఆ లక్షణాలు బయటపడకపోవడం మరో విశేషం. దీని కారణంగా వారికి తమకు కరోనా వచ్చిన విషయమే గుర్తించలేకపోతున్నారు.
అదే సమయంలో వారు నడి వయస్సు, వృద్ధులకు తమ ద్వారా కరోనా వ్యాపింపజేస్తున్నారు. దీని వల్ల ఎక్కువ వయస్సు ఉన్నవారు కరోనా బారిన పడుతున్నారు. ఇంకొందరు కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్నా ఆస్పత్రులకు వెళ్లడంలో ఆలస్యం చేస్తున్నారు. తగిన అవగాహన లేక వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. అందుకే తస్మాత్ జాగ్రత్త.
మరింత సమాచారం తెలుసుకోండి: