భారత్ చైనా వివాదం : చర్చల్లో చైనా బెట్టు.... భారత్ ను బెదిరిస్తూ సైన్యానికి సంబంధించిన వీడియో రిలీజ్...?

Reddy P Rajasekhar

భారత్ చైనా వివాదం లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల సమావేశం తరువాత పరిష్కారం అవుతుందని అందరూ భావించారు. కానీ ఆ సమావేశం ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసిందని తెలుస్తోంది. భారత్ ఏప్రిల్ చివరినాటికి ఏ విధంగా ఇరుదేశాలు ఉన్నాయో ప్రస్తుతం అదే విధంగా ఉండాలని ప్రతిపాదనలు చేయగా చైనా మాత్రం అందుకు అంగీకరించలేదు. చైనా భారత్ సరిహద్దుల్లో చేపట్టిన రోడ్లు, ఇతర నిర్మాణాలను ఆపేయాల్సిందే అని బెట్టు చేసింది. 
 
చైనా దేప్పాంగ్ - గల్వాన్ లోయకు మధ్య భారత్ సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డు చేయాలని చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తోంది. భారత్ మాత్రం మా భూభాగాలలో నిర్మాణాల గురించి చర్చలు జరపడం ఏమిటని చైనాను ప్రశ్నించింది. చైనా భారత్ అధికారుల మధ్య తొలి దశ చర్చలు ఎలాంటి ఫలితం లేకుండా ముగియడంతో మరో దఫా చర్చలు తప్పవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
మరోవైపు చర్చలు విఫలం కావడంతో చైనా బరితెగించింది. తాజాగా సరిహద్దుల్లో బలం, బలగాలకు సంబంధించిన ఒక వీడియోను రిలీజ్ చేసింది. చర్చల అనంతరం చైనా కయ్యానికి కాలు దువ్వే ప్రయత్నం చేస్తోంది. చైనా సైనికులు బోర్డర్ లో విన్యాసాలు చేస్తున్న దృశ్యాలను విడుదల చేసింది. మరోవైపు ఇరుదేశాల మధ్య చర్చల అనంతరం విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. 
 
సాధ్యమైననంత త్వరగా భారత్ చైనా వివాదం సమస్యను పరిష్కరించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. చైనా సరిహద్దు ప్రాంతాలలో బలగాలతో దూకుడు ప్రదర్శించిన నేపథ్యంలో డ్రాగన్ దేశానికి సరైన రీతిలో బుద్ధి చెప్పాలని భారత్ భావిస్తోంది. ఈ క్రమంలో భారత్ కూడా భారీగా సైనిక బలగాలను మోహరించినట్టు తెలుస్తోంది. ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి చైనా ప్రయత్నిస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందటంతో సరిహద్దు ప్రాంతాలలో భారత్ కాపలాను ముమ్మరం చేసింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: