కరోనా వల్ల ప్రజలకు జరిగిన ఒకే ఒక్క మేలు ఏమిటంటే...?

Reddy P Rajasekhar

దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కేసుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. కరోనా వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కరోనా వల్ల గతంలో ఎప్పుడూ చూడని కొత్త కష్టాలను ప్రజలు ఎదుర్కొంటున్నారు. వైరస్ ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి సోకుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. 
 
కరోనా వల్ల ప్రజల్లో మానసిక నిరాశ పెద్దఎత్తున పెరిగింది. ఈ వైరస్ వల్ల ప్రజలు మాస్క్ లు ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి తెచ్చింది. బయటకు అడుగుపెట్టాలంటే ప్రజలు గజగజా వణికిపోతున్నారు. పొరుగింటి వ్యక్తులతో మాట్లాడాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది. 
 
కరోనా వల్ల ప్రజల్లో నిరాశానిస్పృహలు నెలకొన్నాయి. ఇదే సమయంలో దేశంలో లాక్ డౌన్, ఇతర కార్యకలాపాలు ఆగిపోవడం ప్రజల దగ్గ్గర 25 లక్షల కోట్ల రూపాయలు నిలిచిపోయిందని ఒక అంచనా. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు రికార్డు స్థాయిలో నగదు నిల్వ చేసుకున్నారు. ఇది ఆర్బీఐ చెబుతున్న లెక్క. మార్చి 31కు ప్రజల వద్ద ఉన్న నగదు 23.5 లక్షల కోట్లు. 
 
మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు తమ దగ్గరే ఉంచుకున్నారు. 2016లో నోట్లరద్దు సమయంలో ప్రజల దగ్గర 17 లక్షల కోట్లు ఉండగా ప్రస్తుతం 8 లక్షల కోట్లు అదనంగా వచ్చి చేరింది. కరోనా వల్ల ప్రజలు నగదును అత్యవసరమైతే మాత్రమే ఖర్చు చేస్తున్నారు. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లకు వెళ్లడానికి ప్రజలు పెద్దగా ఆసక్తి చూపే పరిస్థితి లేదు. ప్రజల అదనపు ఖర్చులు భారీగా తగ్గాయి. ఇది మాత్రమే కరోనా వల్ల ప్రజలకు కలిగిన ప్రయోజనం అని చెప్పవచ్చు.       

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: