ఒక్కసారిగా మాయమైపోయాడు .. మరో వివాదం లో డాక్టర్ సుధాకర్ !

KSK

గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వివాదాలకు డాక్టర్ సుధాకర్ కేంద్రబిందువు అయ్యాడు. కరోనా వైరస్ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్యులకు కనీస జాగ్రత్తలు కల్పించే విధంగా మాస్కులు ఇవ్వడం లేదని మీడియా ముందు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇటీవల విశాఖపట్నంలో నడిరోడ్డుపై తాగేసి ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి జగన్ ని అదేవిధంగా కొన్ని వర్గాల ప్రజలను కించపరుస్తూ దారుణమైన వ్యాఖ్యలు చేయడం మనకందరికీ తెలిసిందే.

ఈ సందర్భంలో పోలీసులు డాక్టర్ సుధాకర్ ని అదుపులోకి తీసుకోవడంతో విషయం న్యాయస్థానం దాక వెళ్లడంతో ఈ కేసు సీబీఐ దాఖలు చేయటం మనకందరికీ తెలుసు. అయితే ఈ కేసులో భాగంగా విశాఖ పోలీసులు వ్యవహరించిన తీరుపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడంతో విచారణ చాలా చురుగ్గా జరుగుతోంది. ఇటువంటి సమయంలో సుధాకర్ తల్లి తన కొడుకు డాక్టర్ సుధాకర్ ని అప్పగించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

దీంతో తల్లి కోరిక మేరకు న్యాయస్థానం డాక్టర్ సుధాకర్ ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇటీవల మానసిక వైద్యశాల నుంచి డిశ్చార్జి అయిన సుధాకర్ ఒక్కసారిగా మాయమైపోయాడు. ప్రస్తుతం సీబీఐ విచారణ జరుగుతున్న ఇటువంటి సమయంలో డాక్టర్ సుధాకర్ అజ్ఞాతంలోకి వెళ్లడం మరో వివాదంలో డాక్టర్ సుధాకర్ చిక్కుకున్నట్లే అని న్యాయ నిపుణులు అంటున్నారు. మరోపక్క మానసిక విశ్రాంతి కోసం ఓ రహస్య ప్రాంతంలో సుధాకర్ విశ్రాంతి తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: