గుంటూరులో ఆ హోంగార్డు ఆత్మహత్య.. కారణం అదే!

Durga Writes

కొందరు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారో తెలీదు.. ఎందుకు మరణిస్తారో తెలీదు.. మరికొందరు అయితే మరి దారుణం.. అసలు వాళ్ళకు ఉరి వేసుకొని చావల్సిన అవసరం ఏ మాత్రం ఉండదు.. లేదా ఎవరికీ చెప్పలేని కష్టం వస్తుందో తెలియదు ఉరి వేసుకొని మరణిస్తారు. వాళ్ళ కథ ఎవరికి అంతు చిక్కదు. అందరూ కూడా వీళ్ళకు చావల్సిన అవసరం ఏముంది అని అనుకునేవాళ్లే తప్ప నిజం ఎవరికి తెలియదు. 

 

ఇంకా ఇప్పుడు కూడా అదే సమస్య.. కడప జిల్లా మైదుకూరుకి చెందిన 24 ఏళ్ళ మహమ్మద్ పీరా అనే వ్యక్తి గుంటూరులోని వెలగపూడిలోని రాష్ట్ర సచివాలంలో విధులు నిర్వహిస్తు ఆత్మహత్య చేసుకొని మరణించాడు. ఈ మహమ్మద్ పీరా గతంలో ఏపీ డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వర్తించేవాడు. అయితే ఇప్పుడు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఏమైందో తెలియదు సడెన్ గా అతను అద్దెకు ఉంటున్న ఇంట్లో శవమై తేలాడు. 

 

ఇంకా మంగళగిరిలో వడ్లపూడి సెంటర్ లో నివాసం ఉంటు రోజు విధులకు వెళ్లే మహమ్మద్ ఎంతసేపటి బయటకి రాకపోవడంతో స్థానికులు తలుపులు పగలగొట్టి చూశారు. అయితే మహ్మద్ అప్పటికే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాసినట్టు సమాచారం. ఇంకా ఆ సూసైడ్ నోట్ లో తన చావుకు ఎవరు కాదు అని డైరీలో రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతేకాదు అతని డైరీలో ఏటీఎం పిన్ వివరాలు కూడా రాసినట్టు సమాచారం. ఇంకా హోంగార్డు ఆత్మహత్యతో కడపలో విషాదం నెలకొంది.                                                           

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: