
ఎన్ని కుట్రలు, చివరికి ఒంటరి వాడిని చేసి చంపాలనుకున్నారు.. విజయసాయి భావోద్వేగం..?
వైసీపీ పార్టీ కీలక నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నమ్మిన బంటు వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు అయిన విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ ఉంటారు అనే విషయం తెలుస్తుంది. ఎప్పటికప్పుడు తమ ప్రభుత్వం ప్రజల కోసం చేపడుతున్న మంచి పనులను ప్రజల్లోకి చేరేలా చేస్తూ... మరోవైపు ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. అయితే జగన్ సర్కార్ అధికారాన్ని చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా తాజాగా వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే నవ శకానికి నాంది పలుకుతూ తీర్పు వెలువడిన ఈరోజు ఎంతో చిరస్మరణీయం అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి నేటికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా విజయసాయి రెడ్డి వరుస ట్విట్ లు పెట్టారు. తొమ్మిదేళ్ళపాటు ఎన్నికుట్రలు... జైలుకు పంపడం... అభిమన్యుడిలా ఒంటరి వాడిని చేసి మట్టుబెట్టాలని చూశారు.. కర్ణుడిలా అశక్తుణ్ణి చేసి హతమార్చాలని చూశారు... కానీ ఆ గుండె ధైర్యం పట్టుదల ముందు ప్రత్యర్థుల తోక మూడవక తప్పలేదు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ జీవితకాల భరోసా గా నిలిచారు యువనేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ విజయసాయిరెడ్డి ఒక ట్విట్ లో పేర్కొన్నారు.
సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు... ఫ్యాన్ ప్రభంజనానికి దేశమంతా కళ్లార్పకుండా చూస్తోంది... ఏకపక్ష విజయంతో చరిత్రను తిరగరాసారు జననేత జగన్ గారు... తన వెంట నడిచిన ప్రజల కోసం పది తలల నాగుపాము తో పోరాడారు జగన్మోహన్ రెడ్డి. వ్యవస్థను భ్రష్టు పట్టించి వేల కోట్ల రూపాయలు వెదజల్లిన పచ్చ పార్టీ ని పాతాళానికి తొక్కిసారు అంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు. కాగా విజయసాయి రెడ్డి చేసిన ఈ బావోద్వేగపు ట్విట్ లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అటు వైసీపీ నేతలు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా గత సంవత్సరం తమ ఘన విజయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
తొమ్మిదేళ్ల పాటు ఎన్నెన్ని కుట్రలు. జైలుకు పంపడం. అభిమన్యుడిలా ఒంటిరివాడిని చేసి మట్టుపెట్టాలని చూశారు. కర్ణుడిలా అశక్తుడిని చేసి హతమార్చాలని స్కెచ్చులు వేశారు. ఆ గుండె ధైర్యం, పట్టుదలల ముందు ప్రత్యర్థులు తోక ముడవక తప్పలేదు. ప్రజలకు జీవితకాల భరోసాగా నిల్చాడు యువనేత. — Vijayasai reddy v (@VSReddy_MP) May 23, 2020ఏడాది క్రితం ఇదే రోజు, ‘ఫ్యాన్’ ప్రభంజనాన్ని దేశమంతా కళ్లార్పకుండా చూసింది. ఏకపక్ష విజయంతో చరిత్రను తిరగరాశారు జననేత జగన్ గారు. తన వెంట నడిచిన ప్రజల కోసం ‘పది తలల విషనాగు’తో పోరాడారాయన. వ్యవస్థల్ని భ్రష్టుపట్టించి, వేల కోట్లు వెదజల్లిన పచ్చ పార్టీని పాతాళానికి తొక్కారు. — Vijayasai reddy v (@VSReddy_MP) May 23, 2020