కే‌సి‌ఆర్ లో రెండో యాంగిల్ కనిపించేసింది !

KSK

కే‌సి‌ఆర్ ఇప్పటి వరకు తెలంగాణ రాజకీయాల పైన దృష్టి సారించడం జరిగింది. మామూలుగా అయితే గత ఎన్నికల టైమ్ లోనే కే‌సి‌ఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్దామని అనుకోవటం జరిగింది. దానికి సంబంధించి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కూడా అడుగులు వేశారు. కానీ అనుకోని కారణాలవల్ల కే‌సి‌ఆర్ రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అయ్యారు. కానీ చాలా వరకు కే‌సి‌ఆర్ కి జాతీయ రాజకీయాలపై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్లు ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో రాష్ట్రంలో తన కుమారుడు కేటీఆర్ కి పార్టీ బాధ్యతలు అప్పజెప్పడానికి కూడా మొన్నటి వరకు రెడీ అయినట్లు తెలంగాణ రాజకీయాల్లో వార్తలు జోరుగా వచ్చాయి.

 

కరోనా వైరస్ రాకముందు వరకు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యారు కేటీఆర్. తండ్రి స్థానం లోకి వచ్చేస్తున్నాడు ఇలా అనేక రకాల వార్తలు ఆయనపై వచ్చాయి. ఈలోగా కరోనా వైరస్ రావటంతో కే‌సి‌ఆర్ వేసుకున్న లెక్కలు మొత్తం తారుమారయ్యాయి. ఈ నేపథ్యంలో చాలా వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విమర్శించే వైఖరి వాతావరణం గత కొన్నాళ్ల నుంచి లేదు. ఒక్క పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. "> మమతా బెనర్జీ మినహా ఎవరూ కూడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలకు పోవటం లేదు. ఇలాంటి సమయంలోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. "> మమతా బెనర్జీ తర్వాత కే‌సి‌ఆర్ కేంద్రం పై విరుచుకుపడ్డకి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ ఇటీవల మీడియా సమావేశంలో వలస కూలీల రైల్వే ఛార్జీల విషయంలో ఆర్థిక సాయం కేంద్రం భరించలేకుండా రాష్ట్రాలపై వేయడాన్ని తనదైన శైలిలో రెండో యాంగిల్ లో దుమ్మెత్తిపోశారు.

 

అసలే రాష్ట్రానికి ఆదాయం లేక ఉంటున్న సమయంలో సుమారు నాలుగుకోట్ల రూపాయలు వలసకూలీలకు చెల్లించి రైల్ టికెట్స్ కొనుగోలు చేయాలిసి వచ్చిందని వాపోయారు. అంతేకాకుండా రిజర్వేషన్ చార్జీలు, స్పెషల్ ట్రైన్ చార్జీలంటూ రైల్వే ముక్కుపిండి రాష్ట్రాల నుంచి వసూలుకు పాల్పడటం దుర్మార్గం అంటూ ధ్వజమెత్తేశారు. మొత్తంమీద చూసుకుంటే త్వరలో జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్లడానికి రెడీగా ఉన్నట్లు ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తే అర్థమవుతుంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: