జూమ్ అనుసరిస్తున్న ఫేస్ బుక్, గూగుల్ ...?

Suma Kallamadi

నిజానికి ప్రస్తుతం కరోనా కారణంగా ఆఫీసులకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది చాలా వరకు. ముఖ్యంగా ప్రజారవాణా వ్యవస్థ అందుబాటులో ఉండకపోవడంతో దీనితో ఉద్యోగులంతా ఇంటికే పరిమితం అయ్యారు. వర్క్ ఫ్రం హోంలో వున్న ఉద్యోగులను అందరిని కలవడం, వారితో ముఖాముఖి మాట్లాడడం చాలా కష్టం. కాబట్టి వివిధ రకాల ఆదేశాలు ఇవ్వడానికి వీడియో కాన్ఫరెన్స్ లు బాగా సాగుతున్నాయి. అంతేకాకుండా వివిధ ప్రభుత్వ శాఖలు, పోలీసులు కూడా ఇదే వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా ఆదేశాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో దానికి ప్రత్యామ్నాయం కోసం బాగా అన్వేషణ మొదలైంది. అయితే దీనిని గూగుల్ ఈ అవకాశాన్నివినియోగం చేసుకోబోతుంది. ఇప్పుడే తన హ్యాంగ్‌ అవుట్‌ మీట్ ‌ను గూగుల్‌ మీట్‌ గా మార్పు చేసుకొని తీసుకొచ్చింది.

 

అంతేకాకుండా ఇందులో కొత్త ఫీచర్స్ ను జోడించడం విశేషం. అంతేకాకుండా దీని ద్వారా మెరుగైన క్వాలిటీ వీడియో అందుబాటులో వుంటుంది. ముక్యంగా గూగుల్‌ మీట్ ‌లో ఇప్పటివరకు ఒక స్క్రీన్ ‌లో కేవలం 4 గురు మాత్రమే కనిపించేవారు. అయితే ఇప్పుడు దాని సంఖ్యను 16కి పెంచారు. అంతేకాకుండా ఆ వీడియోలో మాట్లాడేటప్పుడు మీరున్న ప్రదేశంలో లైటింగ్‌ కండిషన్‌ కొద్దిగా సరిగా లేకున్నా ఇందులోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ దానిని చూసుకొని సరిచేస్తుంది. అయితే ఇప్పుడు ఇది ప్రస్తుతం మొబైల్‌ యూజర్లకు ఈ సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. 

 


ఇందులో ఇంకా, ఈ మీటింగ్స్ ‌లో వీడియో, ఆడియో కంటెంట్ ‌ను ఇతరులకు షేర్‌ చేసుకునేందుకు వీలుగా 'ప్రెజెంట్‌ ఏ క్రోమ్‌ ట్యాబ్‌' సదుపాయం కూడా తీసుకొచ్చారు. జూమ్ ‌లో మొత్తం బ్రౌజర్‌ షేర్‌ అవుతుంది. అంతేకాకుండా దీనితో పాటు నాయిస్‌ కాన్సిలేషన్‌ సదుపాయం కూడా ఉంది. అయితే జనం ఇప్పుడు వినియోగిస్తున్న జూమ్ యాప్ కంటే గూగుల్ మీట్ చాలా ప్రయోజనకరంగా ఉంది అంటున్నారు. 

 


ఇక ఫేస్ బుక్ కూడా వీడియో కాలింగ్ ను మరింత సులభతరం చేయడం కోసం కొత్తగా మెసెంజర్ రూమ్స్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇక ఈ మెసెంజర్ రూమ్స్ ద్వారా వినియోగదారులు 50 మందితో వీడియో కాల్స్ ఒకేసారి మాట్లాడుకోవచ్చు. అయితే ఈ మెసెంజర్ రూమ్స్ ను ఎవరైనా ఎప్పుడైనా క్రియేట్ చేయవచ్చు. ఇక ఫేస్ బుక్ ఖాతా లేకపోయినా వారు దీనిని వినియోగించుకునే అవకాశం ఇందులో ఉంది. ఇక వినియోగదారుల భద్రత, గోప్యత కోసం ఇందులో ఎవరెవరు చేరుతున్నారో రూమ్ క్రియేట్ చేసిన వ్యక్తి మొత్తాన్ని చూడవచ్చు. ఇక ఇందులో నుంచి ఎవరినైనా సరే తీసేసే అధికారం రూంను క్రియేట్ చేసిన అడ్మిన్ కి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ మెసెంజర్ రూమ్స్ ఈ వారంలో కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులోకి వస్తాయి. రానురాను చిన్నగా దశలవారీగా అన్ని దేశాల్లో వీటిని కొనసాగిస్తామని ఫేస్ బుక్ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: