మినిమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు పొందిన న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ 'సరిపోదా శనివారం'.. ఈ సినిమాలో నాని నట విశ్వరూపం చూపించాడు..శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వచ్చిన ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత నాని నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ “ సరిపోదా శనివారం”.. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టింది..ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో బ్రేక్ ఈవెన్ అవుతున్న సినిమాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ను సాధించడంతో నాని కెరీర్ లో మరో హిట్ పడింది అంటూ ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. “సరిపోదా శనివారం” సినిమాను దర్శకుడు “వివేక్ ఆత్రేయ” తెరకెక్కించాడు.. గతంలో ఈ దర్శకుడు నానితో "అంటే సుందరానికి" అనే సినిమా చేసాడు.. ఆ సినిమా నిరాశ పరచినా కూడా దర్శకుడు వివేక్ ఆత్రేయ పై నాని నమ్మకం ఉంచి ఈ సినిమాను చేశాడు. ఈసారి నాని పెట్టుకున్న నమ్మకంను దర్శకుడు నిరాశ పరచలేదు. ఒక మంచి మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.
ఈ సినిమాలో నానికి జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది.ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్ జే సూర్య ఈ సినిమాలో విలన్ గా నటించాడు. సినిమాలో చూపించిన శనివారం కాన్సెప్ట్ ప్రేక్షకులకు సరికొత్తగా అనిపించడం అలాగే ఎస్. జె. సూర్య సైకో పోలీస్ పెర్ఫార్మన్స్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.. ఒక దశలో హీరో నాని క్యారెక్టర్ ని ఎస్. జె. సూర్య పాత్ర డామినేట్ చేస్తుంది.. అయినా ఎలాంటి ఈగోలకు పోకుండా నాని ఈ సినిమాలో నటించాడు.. అంతే కాకుండా నాని ఈ సినిమాలో తనకి కూడా ఎస్. జె. సూర్య గారి పాత్ర బాగా నచ్చిందని ఓపెన్ గానే చెప్పేసారు.. ఇంతటి పాజిటివ్ యాటిట్యూడ్ వున్న నానిని అందరూ ప్రశంసించారు.. అయితే నానికి ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు బాగా సెట్ అవుతాయని మరోసారి నిరూపితం అయింది. సరిపోదా శనివారం హిట్ అవ్వడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 ను స్వీయ నిర్మాణంలో చేసేందుకు నాని సిద్ధం అవుతున్నాడు. ఇటీవలే గ్లిమ్స్ ను కూడా రిలీజ్ చేయగా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది..