పుష్ప 2: అల్లు అర్జున్‌ కోసం రంగంలోకి జనసేన ?

Veldandi Saikiran
అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. పుష్ప-2 సినిమా రిలీజ్ నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ కు వెళ్లిన సమయంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. అందులో ఓ మహిళ మరణించారు. దీంతో ఈ విషయం పైన అల్లు అర్జున్ పై కేసు నమోదు అయింది. ఈ క్రమంలో అరెస్టు అయిన అల్లు అర్జున్ ఒకరోజు రాత్రి జైలు జీవితం గడపడం జరిగింది.

అయితే అల్లు అర్జున్ జైలుకు వెళ్లిన వెంటనే విశ్వంభర షూటింగ్ నుంచి చిరంజీవి వెంటనే అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పడం జరిగింది. అల్లు అర్జున్ విడుదలైన తర్వాత చిరంజీవి సతీమణి అల్లు అర్జున్ మేనత్త సురేఖ వెళ్లి తన అల్లుడిని చూసి భావోద్వేగానికి గురైంది. తన అల్లుడిని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. నిన్న అల్లు అర్జున్ స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్లారు.

ఆటు రేవతి కొడుకు కోసం ఎంతైనా డబ్బులు ఖర్చు పెట్టడానికి అల్లు అర్జున్ సిద్ధంగా ఉన్నారు. ఇదిలా ఉండగా.... ఈ విషయం మీద జనసేన బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు. అల్లు అర్జున్ ఆ ఘటనలో ఇబ్బంది పడిన కుటుంబాన్ని బాధ్యతగా మీరు తీసుకోండని చెప్పాడు. మీ ప్రయాణం ఇప్పుడు ఇప్పుడే మొదలవుతోంది. ఇంకా చాలా దూరం మీరు వెళ్లాల్సి ఉంటుంది. ఆకాశమే మీ హద్దు. జనాన్ని మీరు ఇన్స్పైర్ చేయండి.

అలాగే మీ మీద జనం ఉంచిన నమ్మకాన్ని కూడా ముందుకు తీసుకువెళ్లండి అంటూ బొలిశెట్టి సత్యనారాయణ చెప్పుకొచ్చాడు. అంతేగాక తాను విశాఖపట్నంలో ఉన్న మీ తాత గారి స్నేహితులలో ఒకరినని ఆయన కామెంట్ చేశాడు. అంతేకాకుండా ఈ పోస్టులో జనసేన ను పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేయడం గమనార్హం. బొలిశెట్టి సత్యనారాయణ చేసిన కామెంట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: