కొన్ని సంవత్సరాల క్రితం శ్రీ సింహ హీరోగా రితీష్ రానా దర్శకత్వంలో మత్తు వదలరా అనే సినిమా వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ విడుదల సమయంలో ఈ సినిమాపై ప్రేక్షకులు పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. కానీ విడుదల అయిన తర్వాత ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి ఈ మూవీ కి మంచి టాక్ రావడంతో ఈ మూవీ మెల్లి మెల్లిగా పెద్ద స్థాయి కలెక్షన్ లను వసూలు చేసి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విజయం సాధించడంతో ఈ మూవీ కి కొనసాగింపుగా మత్తు వదలరా 2 అనే సినిమాను శ్రీ సింహ హీరో గా రితేష్ రానా తెరకెక్కించాడు.
ఈ మూవీ లో సత్య , ఫరియా అబ్దుల్లా , వెన్నెల కిషోర్ , అజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. మంచి విజయం సాధించిన మత్తు వదలరా సినిమాకు సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు కూడా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ పెద్ద స్థాయి కలెక్షన్ లను వసూలు చేసి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సంవత్సరం చిన్న సినిమాగా విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకున్న సినిమాలలో మత్తు వదలరా 2 సినిమా నిలిచింది.
ఇకపోతే ఈ సినిమా లోని శ్రీ సింహా నటనకు , సత్య కామెడీ టైమింగ్ ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. అలాగే వెన్నెల కిషోర్ కూడా ఈ మూవీ లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. కాల భైరవ ఈ సినిమాకు సంగీతం అందించగా ... మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించారు. కాల భైరవ అందించిన సంగీతం కూడా ఈ సినిమా విజయంలో కీలక పాత్రను పోషించింది.