కరోనా సమయంలో అమెరికాకు రెండు విమానాలు... కేసీఆర్ సంచలన నిర్ణయం

Arun Showri Endluri
భారతదేశంలో లాక్ డౌన్ చాలా పటిష్టంగా అమలు అవుతోంది. కేంద్రం కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు లాక్ పొడిగించే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ తో సహా మరో నాలుగు రాష్ట్రాలు ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్ పొడిగిస్తున్నట్లు చెప్పేశాయి. అలాగే అక్కడ అన్ని రకాల రవాణా సౌకర్యాలను నిలిపివేసిన వేళ శుక్రవారం శంషాబాద్ ఎయిర్ పోర్టుకి రెండు విమానాలు వచ్చాయి.

నిన్నటిదాకా ఎలాంటి కార్యకలాపాలు లేకుండా బోసిపోయిన విమానాశ్రయం లో ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది. కరోనా కారణంగా గత మూడు వారాల నుండి ప్రయాణ సేవలు నిలిపివేసిన శంషాబాద్ ఎయిర్ పోర్టు శుక్రవారం మాత్రం కళకళలాడింది. విషయం ఏమిటంటే హైదరాబాద్ లో చిక్కుకున్న అమెరికన్లను వారి దేశానికి చేరవేసేందుకు రెండు రెండు విమానాలు శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చాయి.

ఈ విమానాలు హైదరాబాద్ నుండి ముంబై వెళ్లి అక్కడి నుండి అమెరికన్లను మరొక ప్రత్యేక విమానంలో అమెరికాకు తీసుకువెళ్తారు.అమెరికన్ కాన్సులేట్.. తెలంగాణ ప్రభుత్వం సమన్వయంతో సాగుతున్న ఈ ప్రక్రియలో హైదరాబాద్ లో చిక్కుకున్న అమెరికన్లను వారి దేశాలకు తరలించేలా నిర్ణయం తీసుకున్నారు.

ఇందులో భాగంగా ఒక విమానంలో 70 మంది.. మరో విమానంలో 98 ప్రయాణికులు బయలుదేరి వెల్లారు. ఇందులో భాగంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికుల్ని ముందుగా పూర్తిస్థాయిలో శానిటైజ్ చేశారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ అమెరికన్లను విమానంలో ఎక్కించిన ఎయిర్ పోర్టు సిబ్బంది అనంతరం వారికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. ఈ కార్యకలాపాలతో పాటు అన్నింటికీ అవసరమైన సిబ్బందిని ప్రత్యేకంగా తీసుకొచ్చి విధులు నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: