జ‌న‌తా క‌ర్ఫ్యూ: ఇంటి కోసం ఓ గంట‌

Durga Writes

జనతా కర్ఫ్యూ.. ఈ కర్ఫ్యూ ఎందుకు పెట్టారు అని ఎందరికో సందేహం ఉంటుంది. అయితే అసలు ఈ జనతా కర్ఫ్యూ ఎందుకు అంటే కరోనా వైరస్.. ఈ పేరు వినని వారు ఉండరు.. మరు మూలా గ్రామాల్లో ప్రజలకు కూడా ఈ కరోనా వైరస్ గురించి తెలిసి ఉంటుంది. ఎందుకంటే అలాంటి వార్త ఇది. 

 

 

ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ ఈ కరోనా వైరస్ వణికించేస్తోంది. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టినా ఈ కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించేస్తోంది. ప్రపంచమంతా తిరిగి తిరిగి ఈ కరోనా వైరస్ ప్రస్తుతం భారత్ లోకి ప్రవేశించి చాప కింద నీరులా దేశమంతా వ్యాపిస్తుంది. దీంతో ఒకరోజు అంత కూడా అందరూ ఇళ్లల్లోనే ఉండాలి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 

 

 

ఈరోజు ప్రజలు అందరూ కూడా ఇంటి వద్దే ఉంటున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు అంత కూడా ఇంటికే పరిమితమయ్యారు. అయితే కుటుంబంతో గడపడానికి ఇది మంచి సమయం. అమ్మమ్మలు.. తాతయ్యలు.. అమ్మ నాన్న.. భార్య పిల్లలతో ఆనందంగా కుటంబంతో గడపండి. 

 

 

ఇంకా ఉదయం 7 నుండి రాత్రి 9 వరకు కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఆలోచనలు పెట్టుకోకుకండా.. ఫోన్ పట్టుకోకుండా.. టీవీ చూడకుండా.. ఇంటి కోసం ఓ గంటసేపు కేటాయించి ఇంటిని శుభ్రం చేసుకోండి.. పాత సామాన్లను ఏరి పారేద్దాం... దుమ్ము దూళిని దులిపేద్దాం ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకుందాం. ఇంటి కోసం గంట కేటాయించండి.. ఆనందంగా ఉండండి.                               

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: