మహిళా ట్రయిల్ రూంలో నిఘా కెమెరాలు.. షాప్ యాజమాన్యం ఫై ఆగ్రహం
మహిళల పై ఎదో విదం గా లైంగిక దాడులు జరుగుతూ నే ఉన్నారు.. ఎదో రకం గా మహిళల ని హింసిస్తూ నే ఉన్నారు. ఈ మేరకు ఓ షాపింగ్ మాల్ లో మహిళల ట్రయిల్ రూంలో నిఘా కెమెరాలను ఏర్పాటు చేసిన ఘటన లేటుగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల జరిగిన ఓ షాపింగ్ మాల్ లో సిసి కెమెరాల నిఘా ఉందని తెలుసుకున్న ఓ మహిళా షాప్ యాజమాన్యం పై ఫిర్యాదు చేసింది.
తాజాగా షాపింగ్ మాల్ ట్రయల్ రూంలో బట్టలు మార్చుకుంటుండగా ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఎవరో తనను చూస్తున్నట్లు గ్రహించి బయటకు రావడంతో ఓ వ్యక్తి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన నోయిడాలో చోటుచేసుకుంది.నోయిడాకు చెందని ఓ మహిళ తన భర్తతో కలిసి నగరంలోని షాపింగ్ మాల్‌కి వెళ్లింది. దుస్తులు సెలెక్ట్ చేసుకుని అవి సరిపోయతాయో లేదో చూసుకునేందుకు ట్రయల్ రూం కి వెళ్లింది. ఆమె లోపల బట్టలు మార్చుకుంటున్న సమయంలో అలికిడి కావడంతో కంగారు పడిపోయింది.
అయితే ట్రయిల్ రూమ్ రందరం నుండి హౌస్ కీపింగ్ వ్యక్తి రంద్రంలో నుండి చూడటంతో హడలిపోయిన ఆమె, వెంటనే బట్టలు వేసుకొని జరిగిన విషయాన్ని అతను షాప్ యజమానికి జరిగిన విషయాన్ని చెప్పాడు. అతను మాల్ సిబ్బందిని హెచ్చరించాడు. మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిని హౌస్‌కీపింగ్ యువకుడిగా గుర్తించారు. వెంటనే జరిగిన విషయాన్నీ పోలీసులకు తెలియజేసారు.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసుకొని అతన్నీ అదుపులోకి తీసుకున్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి షాప్ లోని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. రిమాండ్ కు పంపిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.