ముఖేష్ తో భేటి వల్ల జగన్ కు ఎన్ని లాభాలో తెలుసా ?

Vijaya
జగన్మోహన్ రెడ్డి –ముఖేష్ అంబానీ భేటి రాష్ట్ర రాజకీయ, పారిశ్రామిక రంగాల్లో సంచలనంగా మారింది. జగన్ తో రిలయన్స్ అధినేత, దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ దాదాపు రెండు గంటలు భేటి  అయ్యారు. వ్యక్తిగత ప్రయోజనం కోసమే సిఎంతో భేటి అయ్యేందుకు ముఖేష్ వచ్చారన్నది  వాస్తవం. అయితే తన అవసరం కోసం ఓ పారిశ్రామిక వేత్త తనను కలిసినపుడు రాష్ట్ర ప్రయోజనాల విషయం  వీళ్ళ మధ్య చర్చకు రాకుండా ఉంటుందా ?

ఇపుడు జరిగింది కూడా ఇదే అని సమాచారం. ముఖేష్ అడిగిన ఫేఫర్ కు సానుకూలంగా స్పందించిన జగన్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విషయాన్ని ప్రస్తావించాడని పార్టీ వర్గాలు చెప్పాయి. సిఎం అడిగినట్లుగా రిలయన్స్ అధినేత స్పందిస్తే జగన్ కు ముఖ్యంగా మూడు ప్రయోజనాలు ఉన్నాయని చెప్పాలి. అదేమిటంటే రిలయన్స్ పెట్టుబడులు పెడితే పారిశ్రామిక రంగానికి మంచి ఊపుస్తొంది. అది రాష్ట్రాభివృద్ధికి చాలా ఉపయోగం.

ఇప్పటి వరకూ తూర్పుగోదావరి జిల్లాలో నేచురల్ గ్యాస్ వెలికితీసే విషయంలో మాత్రమే పెట్టుబడులు పెట్టింది రిలయన్స్. ఇది తప్ప ఇతర రంగాల్లో రిలయన్స్ పెట్టుబడులు దాదాపు  లేవనే చెప్పాలి. అలాంటిది ఇతర రంగాల్లో కూడా ముఖేష్ పెట్టుబడులు పెడితే అది జగన్ క్రెడిట్ అనే చెప్పుకోవాలి. ఇక రెండో ప్రయోజనలమేమిటంటే తనపై ప్రతిరోజు బురద చల్లుతున్న చంద్రబాబు అండ్ కో తో పాటు పచ్చమీడియా నోళ్ళను పర్మినెంట్ గా మూయించేయొచ్చు.

జగన్ వల్లే రిలయన్స్ రాష్ట్రం వదిలి పారిపోయిందని బురద చల్లుతున్న వాళ్ళకు ఇక నుండి ఆ అవకాశం ఉండదన్నది వాస్తవం. అలాగే ఏ సెట్ లాంటిదో ఏర్పాటు చేసి అమరావతి ప్రాంతంలో రిలయన్స్ కు భూములు కేటాయించేస్తే చంద్రబాబు, పచ్చమీడియా ఇక నోరెత్తదు. దాంతో రైతుల ఆందోళనలు కూడా ఒక్కసారిగా మాయమైపోతుంది. దాని వల్ల జగన్ కు చాలా పెద్ద రిలీఫ్ వస్తుంది. ఒకసారి ముఖేష్ అంతటి వ్యక్తే పెట్టుబడులు పెట్టాడంటే మిగిలిన వాళ్ళు ఏపికి రాకుండానే ఉంటారా ? తొందరలోనే చంద్రబాబుకు ఇంకో సన్నిహితుడైన అదానీ కూడా జగన్ తో భేటికి వస్తాడేమో ? ఎవరికి తెలుసు ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: