ట్రంప్‌ యాత్ర : అమెరికన్ సీక్రెట్ ఏజెంట్స్.. అమ్మో వీళ్లు గుండెలు తీసిన బంట్లు..?

Chakravarthi Kalyan
అమెరికా అధ్యక్షుడు అంటే మామూలు విషయంకాదు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడు. మరి అలాంటి వ్యక్తి సెక్యూరిటీ ఎంత పటిష్టంగా ఉంటుంది. అందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు.. ట్రంప్ ఇడింయా వస్తున్న నేపథ్యంలో ఈ అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి. అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీ పని తీరు ఎలా ఉంటుంది.. ట్రంప్ సెక్యూరిటీ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూద్దాం.

అమెరికా అధ్యక్షుడిపై ఒక వేళ దాడి జరిగినా ఎదుర్కొనేందుకు సీక్రెట్‌ ఏజెంట్లకు ముందుగానే ట్రైనింగ్ ఇస్తారు. ట్రంప్ ఎక్కడికైనా వెళ్తే.. ఆ ప్రాంతంలోని లోకల్ నేరస్తుల్ని ముందు గుర్తిస్తారు. అనుమానాస్పద వ్యక్తులను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకుంటారు.

ఇక విదేశీ పర్యటనలో సమయంలో ఈ భద్రత ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఆయనతో పాటు ఏకంగా ఓ విమానమే ఉంటుంది. భద్రతకు సంబంధించి మొత్తం ఏడు విమానాలు అధ్యక్షుడి వెంటే ఉంటాయి. ఎందుకైనా మంచిదని.. ప్రెసిడెంట్ రక్త నమూనాకు సరిపడే రక్తాన్ని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్‌ ఎప్పుడూ తమతో తీసుకువస్తారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడి చికిత్స అందించాల్సి వచ్చినప్పుడు 10 నిమిషాల్లోనే అందుకు రెడీ అవుతారు.

అంతే కాదు.. ఈ ఏజంట్స్ ఎప్పుడూ ప్రెసిడెంట్ ను కూడా కోడ్ భాషలోనే మాట్లాడుకుంటారు. అసలు పేరు ఎప్పుడూ పలకనే పలకరు. మరి డొనాల్డ్ ట్రంప్ అంటే అగ్రరాజ్యానికి అధినేత. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నాయకుల్లో ఒకరు. ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోరా మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: