విశాఖలో హై ఎండ్ స్కిల్ సెంటర్ ఏర్పాటు
ఇంజినీరింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు వీటిల్లో ప్రవేశం కల్పించి వారిని మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని ఆయన స్పష్టం చేశారు. వీటికి సంబంధించి 45 రోజుల్లోగా భూముల గుర్తింపు, ఆర్థిక వనరుల సమీకరణ పూర్తి కావాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో.. పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూదన్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పంచాయితి సెక్రెటరీల బదిలీలపై బ్యాన్ ఎత్తివేసిన ప్రభుత్వం. మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని, ఆపైగా ఒకే చోట పనిచేస్తున్నవారు, సొంత గ్రామ పంచాయితీ, సొంత మండలంలో పనిచేస్తున్నవారిని బదిలీ చేయాలని ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం. గ్రేడ్ ఒన్ పంచాయితి సెక్రెటరీలను గ్రేడ్ ఒన్ పంచాయితీలకు బదిలీ చేయాలని, హైయర్ గ్రేడ్ గ్రామ పంచాయితీ సెక్రెటరీలకు తగిన పోస్ట్ లేని పక్షలో లోయర్ గ్రేడ్ గ్రామ పంచాయితీలకు బదిలీ చేయవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం.