స్టార్ హీరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శ్రీ లీల..!?

Anilkumar
సాధారణంగా ఏ సిని ఇండస్ట్రీలో నైనా ఏ స్టార్ హీరోకి ఎప్పుడు స్టార్డం వస్తుందో తెలియదు. ఏ స్టార్ హీరో స్టార్ డం పడిపోతుందో కూడా తెలియదు. అయితే అప్పటివరకు సినీ ప్రపంచానికి తెలియని కొందరు ఓవర్ నైట్ లోనే స్టార్స్ గా మారిపోతూ ఉంటారు. ఇక దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ యంగ్ బ్యూటీస్ శ్రీ లీల అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ బ్యూటీ నక్క తోక తొక్కి వచ్చింది అని అంటుంటారు చాలామంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యింది ముద్దుగుమ్మ. అలా మొదటి సినిమాతోనే భారీగా క్రేజ్ సంపాదించుకుంది. అయితే గత ఏడాది విడుదలైన సినిమాలన్నీ బాగానే ఆడాయి.

 కానీ రిలీజ్ కి ముందు హైప్ ఇచ్చిన పాటలు రిలీజ్ తర్వాత శ్రీ లీల అందాల ఆరబోతకు థియేటర్స్ లో బాగానే రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అయితే కేవలం శ్రీ లీల గురించి సినిమాలకి వెళ్లే ఆమె అభిమానుల సంఖ్య పెద్ద ఎత్తున ఉంటుంది అని చెప్పడంలో ఏం లేదు. అయితే పెళ్లి సందడి సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించింది ఈ ముద్దుగుమ్మ.  ఆ పాత్రలో నటించినప్పటికీ ఈమెకి పెద్దగా క్రేజ్ రాలేదు. ఆ తర్వాత ఈమె చేసిన సినిమాలు అన్నీ కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి. అయితే ఈ సినిమా తర్వాత ఆమె చేసిన ధమాకా సినిమాతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది . రవితేజ శ్రీ లీలా కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా యంత్ర బ్లాక్ బస్టర్

 విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలో కొత్తదనం ఏమీ లేకపోయినప్పటికీ రవితేజ కామెడీ శ్రీ లీల గ్లామర్ షో ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాగా శ్రీలీలకు ఇప్పుడు మరో భారీ అవకాశం తలుపు తట్టినట్లు తెలిసింది. కార్తీ హీరోగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తుందని, ఇందులో హీరోయిన్‌గా ఈమెని తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమై, మూవీ హిట్ అయితే మాత్రం తమిళంలో శ్రీలీల క్రేజ్ పెరగడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. తెలుగులో జెండా ఎగరేసినట్లుగానే తమిళంలోనూ ఆమె ఖచ్చితంగా తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకుంటుంది అనటంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: