సందీప్ కిషన్ కొత్త సినిమా బడ్జెట్ ఎన్ని కోట్లు తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
టాలీవుడ్ యంగ్ హీరోలలో సందీప్ కిషన్ కూడా ఒకరు. ఇక ఈ యంగ్ హీరోకి ప్రేక్షకుల్లో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే సరైన హిట్ లేక గత కొంతకాలంగా సతమతమవుతున్నాడు సందీప్ కిషన్ . సరైన స్క్రిప్టులను ఎంచుకోకపోవడం వల్లే ఆయన ఇప్పటివరకు వరుస ఫ్లాప్ తో బాధపడుతున్నారు. కాగా చాలా కాలం తర్వాత ఇటీవల ఊరు పేరు భైరవకోన సినిమాతో హిట్ కొట్టాడు. ఇక ఈ సినిమా తో మళ్ళీ తన దశ తిరిగింది అని చెప్పాలి. థియేటర్స్ లో ఈ సినిమా మంచి స్థాయిలో కలెక్షన్స్ను

 సొంతం చేసుకుంది. సినిమా కథనం బాగుండడంతో ఈ సినిమాకి మంచి హిట్ టాక్ లభించింది. ప్రస్తుతం సందీప్ కిషన్ తన తదుపరి సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తీస్తున్నారు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  దాదాపుగా 25 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమాను తీస్తున్నారు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అన్ని అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా వినబడుతున్నాయి.

 భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో సిజి విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సందీప్ కిషన్ సైతం కథ, కథనంపై దృష్టి పెడుతూ ప్రాజెక్ట్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారు. సందీప్ కిషన్ రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది. చాలామంది హీరోలతో పోల్చి చూస్తే తక్కువ పారితోషికం తీసుకుంటూ ఉండటం ఈ నటుడికి మరింత ప్లస్ అవుతోంది. సందీప్ కిషన్ కు ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: