ఇండియా, మాల్దీవుల మధ్య మొదలైన వివాదం ఇంకా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మన దేశంతో సంబంధాల వల్ల ఆ దేశం పురోగమనం ముడిపడి ఉందనే కనీస జ్ణానాన్ని కూడా మరిచిపోయి కళ్ళు మూసుకుపోయి కావాలనే మనతో విభేదాలు పెంచుకున్నారు.ఇక దాని ఫలితంగా వారి ఆదాయానికి గండి పడింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు భారతీయులు మంచి వారు మాతో కలిసి రండని బ్రతిమిలాడినంత మాత్రాన సంబంధాలు బాగుపడతాయా? మన ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టిన మాల్దీవులకు ఇప్పుడు తగిన గుణపాఠమే కలిగింది.అసలు మాల్దీవులకు వచ్చే ఆదాయంలో ప్రతి పైసా మనదే. మనం ఏదో పోనీలో అని వేసిన భిక్షంతో వారు ఇప్పటిదాకా బ్రతికారు. కానీ మన భిక్షమే తిని మన ఆత్మాభిమానాన్నే దెబ్బతీశారు. భారతీయులు అసలు శుభ్రంగా ఉండరు. వారి దేశం అశుభ్రతకు మారు పేరు అని మన దేశాన్ని ఘోరంగా అవమానించి మన దేశం గురించి రకరకాల కామెంట్లు చేశారు. దీంతో మన వాళ్లకి కాలడంతో ఆ దేశంతో సంబంధాలు దెబ్బకి కట్ చేసుకున్నాం. దీంతో వారి ఆదాయం అనేది క్రమంగా తగ్గుతూ వచ్చింది.ఇప్పుడు ఆ దేశ మంత్రి ఇబ్రహీం ఫైజల్ భారతీయులు తమ దేశానికి రావాలని ముష్టి వాడిలా అడుక్కుంటున్నాడు.
మా కొత్త ప్రభుత్వం ఇండియాతో కలిసి పనిచేస్తుందని చెబుతున్నా మన దేశం మాత్రం వారి మాటలను అస్సలు పట్టించుకోవడం లేదు. ఒకసారి పోయిన నమ్మకాన్ని తిరిగి పొందడం అంత సులభం కాదు. అందుకే మాట, తూట జారితే తిరిగి తీసుకోలేమని విషయం వారు గుర్తించక ఇప్పుడు వారి మాటలకు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు.వాళ్ళ టూరిజంలో భారతీయుల పాత్ర ఉండాలని కోరుకుంటున్నట్లు విజ్ణప్తి చేస్తున్నారు. మా పురోగమనంలో మీ పాత్ర ఎక్కువగా ఉందనే విషయం మేం గుర్తించాం. దయచేసి మా విన్నపాన్ని మన్నించండి అంటూ వేడుకుంటున్నారు. కానీ మనకు మాత్రం వారి మాటల మీద నమ్మకం పూర్తిగా పోయింది. లేని పోని మాటలు మాట్లాడటం వల్ల ఆ దేశం భారీ మూల్యాన్నే చెల్లించుకుంటోంది.మన ప్రధానమంత్రి మన లక్ష్యద్వీప్ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తే టూరిజం బాగుంటుందని చెబితే దానిపై మాల్దీవులు కౌంటర్ వేయడం భారతీయులను బాధించింది. మన బిక్షం వేసిన సొమ్ముతో అడక్క తిని జల్సాలు చేసుకునే ఆ దేశం మన మీదే పెత్తనం చెలాయించాలని చూస్తే ఫలితం ఇలానే ఉంటుంది.