హైదరాబాద్ లో కరోనా కలకలం...???

ప్రపంచంలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఈ కరోనా వైరస్ కి చైనాలో ఇప్పటికి 200 పైగా చనిపోగా., ఈ వైరస్ తో బాధపడేవారు, అనుమానితులను లెక్కల్లో చెప్పలేము. కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందుతుండటంతో.. వణికిపోతున్నారు. ప్రస్తుత ప్రజలందరినీ వణికిస్తున్న కరోనా వైరస్ హైదరాబాద్ కి వ్యాపించాయనే వార్తలు వినిపిస్తున్నాయి.  అలాగే హైదరాబాద్  అనుమానంతో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య క్రమంగా పెరిగింది.  

 

హైదరాబాద్ నగరంలో ఇప్పటివరకు 15 కేసులు నమోదైనట్లు వైద్యులు తెలిపారు. వీరి రక్త నమూనాలను తీసుకొని పూణే ల్యాబొరేటరీకి పంపించినట్లు.. కాగా వీరిలో తొమ్మిది మందికి నెగటివ్ రిపోర్ట్ రాగ.. మరికొంత మంది రిపోర్టు అందించాల్సి ఉంది.  ఇప్పటి వరకు హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ లో శుక్రవారం వరకు రెండు కేసులు మరియు ఫీవర్ ఆసుపత్రి లో నాలుగు కేసులు నమోదయ్యాయని డాక్టర్లు తెలిపారు. కరోనా వైరస్ అనుమానిత కేసులను గుర్తించిన వారిని వారికి ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు.  

 

 కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన వైద్య కిట్లు ఢిల్లీ నుంచి వచ్చాయి. రెండు రోజుల పాటు నమూనా పరీక్షలు నిర్వహించి కరోనా వైరస్‌ నిర్ధారణ టెస్టులు చేపట్టనున్నారు.

 

కరోనా వైరస్ సోకిన వారిలో జలుబు, దగ్గు, జ్వరానికి సంబంధించిన లక్షణాలే ఉండటం గమనార్హం. దీంతో సీజనల్ వ్యాధులకు గురైన వారు కూడా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఇటీవల విదేశాల నుంచి తిరిగొచ్చిన వారు మరింత భయాందోళనకు గురవుతున్నారు. అయితే.. ఇప్పటి వరకు హైదరాబాద్‌ లో కరోనా వైరస్‌ కు సంబంధించి ఒక్క కేసు కూడా నమోదవలేదని వైద్యులు స్పష్టం చేశారు. కానీ అనుమానిత కేసులున్నాయని అవి కూడా త్వరలోనే పరీక్షలు చేపట్టి చెప్తామని స్పష్టం చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: