వైస్రాయ్ రోజులు పోయాయని బాబోరి బ్యాచ్ తెలుసుకోవాలి : రాజధాని ఆందోళనలను వైస్రాయ్ లా చేయలేరంటున్న తెలుగు ప్రజ ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని దీని కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు అయ్యే అవకాశం ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఒకే చోట అభివృద్ధి కాకుండా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలని ఉద్దేశంతోనే ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని అనుకుంటుందని... అమరావతి తో పాటు విశాఖ కర్నూల్ లో మరో రెండు రాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటున్నామని ప్రకటన చేశారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. అయితే జగన్ 3 రాజధానిల ప్రకటనపై ప్రతిపక్ష పార్టీలన్నీ విరుచుకు పడుతున్నాయి. మూడు రాజధానిలో నిర్మాణం వల్ల ప్రజాధనం వృధా అవుతుందే తప్ప అభివృద్ధి మాత్రం జరగదు అంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. అంతే కాకుండా అటు రాజధానిలో కూడా జగన్ నిర్ణయంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతి వాసులు చేస్తున్న నిరసన ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తుంది.
అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్ 3 రాజధాని విషయంలో ఆనాటి వైస్రాయ్ కుట్ర అమలు చేయాలని అనుకుంటున్నట్లు తెలుగు ప్రజలు భావిస్తున్నారు. ఆనాడు అన్న ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీ ని ఆయన దగ్గరనుంచి చేజిక్కించుకున్నారు బాబోరు . వైస్రాయ్ హోటల్ వేదికగా ఎన్టీఆర్ పైన ఆయన మనుషులతోనే విమర్శలు గుప్పించి చెప్పులు సైతం అన్నగారి పై విసిరించారు. అయితే అప్పటి వైస్రాయ్ ప్లానే ఇప్పుడు రాజధాని విషయంలో కూడా చంద్రబాబు అమలు చేస్తున్నారని తెలుగు ప్రజలు భావిస్తున్నారు. అమరావతిలో నిరసనలు వెనక సూత్రధారి చంద్రబాబే అని భావిస్తున్నారు. వైస్రాయ్ రోజులు పోయాయని బాబోరి బ్యాచ్... ఇంకెప్పుడు తెలుసుకుంటుందో అంటూ తెలుగు ప్రజల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అప్పటి వైస్రాయ్ కుట్రలను వ్యూహాలను ఇప్పుడు అమలు చేస్తూ జగన్ 3 రాజధానిల ప్రకటనపై విమర్శలు గుప్పించేందుకు నిరసనలు తెలిపేందుకు చంద్రబాబు వ్యూహాలు పన్నుతున్నారు అంటూ ఆంధ్ర ప్రజలు అనుకుంటున్నారు. అందువల్లే ఇప్పటి వరకు ఎప్పుడు లేని ప్రేమ రైతులపై చంద్రబాబుకు పుట్టుకొచ్చిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఎన్ని కుట్రలు పన్నినా అవి నీటిమీద బుడగలే అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎంత మంది సీఎం జగన్ పై ఉసిగొలిపి ఆందోళనలు జరిపినప్పటికీ.. అప్పటి వైస్రాయ్ పరిస్థితులు ఇప్పుడు లేవు అని.. అక్కడున్నది చంద్రబాబును నమ్మిన ఎన్టీఆర్ కాదని సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఆంధ్ర ప్రజలు అంటున్నారు.