శభాష్! జాతీయ గీతం ఆలపించి వందలమంది ఆందోళనకారులను ఇంటికి పంపించిన డీసీపీ..!

Yelleswar Rao

పౌరసత్వ సవరణ చట్టాన్ని దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రజలు వ్యతిరేకిస్తూ ఆందోళనలను చేపడుతున్నారు. ఈ క్రమంలోనే... గురువారం రోజు కర్ణాటక రాజధాని బెంగళూరులోని టౌన్ హాల్ వద్దకు వందల మంది ఆందోళనకారులు వచ్చి నిరసనలు చేపట్టారు. దాంతో పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అడ్డుకునేందుకు ఎంతో ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు. 144 సెక్షన్ విధించినప్పటికీ.. వారు దానిని కూడా ఎదుర్కొని 4 గంటల పాటు అలాగే నిరసనలను చేస్తున్నారు.

ఇక లాభం లేదనుకున్న బెంగళూరు సెంట్రల్ డీసీపీ చేతన్‌ సింగ్‌ రాఠోడ్‌ .. టౌన్ హాల్ వద్దకు వచ్చి వందలాది మంది ఆందోళనకారులతో మైక్ ద్వారా మాట్లాడుతూ..'నేను అర్ధరాత్రి 2నుంచి నిద్రపోలేదు. దయచేసి ఇక్కడినుంచి వెళ్ళిపోండి' అంటూ నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. కానీ వాళ్లు డీసీపీ చేతన్ సింగ్ మాటలను పట్టించుకోకుండా.. వారి నిరసనలను అలాగె కొనసాగించారు. మళ్ళీ మాట్లాడుతూ... సంఘ వ్యతిరేక శక్తులు కేవలం వారి సొంత ప్రయోజనాల కోసమే మీ చేత ఆందోళలను చేయిస్తున్నారని చెప్పారు. అప్పటికీ, ఆందోళనకారులు డీసీపీ మాటలను ఖాతరు చేయకుండా గట్టిగా నినాదాలు చేయడం ప్రారంభించారు.

తాను చెప్పేదంతా నిజమని డీసీపీ ఆందోళనకారులకు చెబుతూ... 'చట్టాలు వస్తూనే ఉంటాయి. కావాలంటే చట్ట సవరణలు మన మంచి కోసమే జరుగుతాయి. అది నేను మీకు భరోసా ఇస్తున్న. నా మాటలను నమ్మినట్లయితే.. మీరు నాతో కలిసి జాతీయ గీతం పాడండి' అని 'జన గణ మన' జాతీయ గీతాన్ని ఆలపించడం ప్రారంభించాడు. దాంతో అక్కడ ఉన్న వారంతా నిల్చొని డీసీపీ తో సహా జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆ తర్వాత టౌన్ హాల్ ని నినాదాలతో హోరెత్తించిన వారంతా మౌనం అయిపోయారు. ఇంతకుముందు అదుపులోకి తీసుకున్న ఆందోళనకారులని విడిచిపెడతామని డీసీపీ వారితో చెప్పారు. అంతే..!! డీసీపీ తన వాక్చాతుర్యంతో దేశ భక్తిని ప్రతి ఆందోళనకారిడిలో కల్పించి 4 గంటల పాటు... వందల మంది పోలీసులు అడ్డుకోలేని ఆందోళకారుల్ని కేవలం పది నిమిషాలలో ఇంటికి పంపించేశారు. అయితే, డీసీపీ చేతన్ సింగ్ వీడియోని బెంగళూరు ఐజీపీ హేమంత్‌ నింబాల్కర్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది. 

https://mobile.twitter.com/IPSHemant/status/1207712549405253634

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: