గుర‌జాల‌లో య‌ర‌ప‌తినేని Vs కాసు... ప‌ల్నాడులో ఆ పార్టీ బొక్క బోర్లానే..!

RAMAKRISHNA S.S.
- వ‌రుస‌గా రెండోసారి పోటీలో య‌ర‌ప‌తినేని, కాసు
- బీసీ అగ్ర‌ నేత ' జంగా ' ను అవ‌మాన‌క‌ర రితీలో గెంటేసిన వైసీపీ
- గుంటూరు జిల్లాలోనే కమ్మ Vs రెడ్డి నేత‌లు పోటీ ప‌డే ఏకైక సీటు
( ప‌ల్నాడు - ఇండియా హెరాల్డ్ )
ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం గుంటూరు జిల్లాలోని పలనాడులో.. గురజాల - మాచర్ల రాజ్యాల మధ్య పల్నాటి యుద్ధం జరిగింది. కట్ చేస్తే గత కొన్ని రోజుల నుంచి గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగే శాసనసభ ఎన్నికలు కూడా అలాగే పల్నాటి యుద్ధాన్ని తలపిస్తూ ఉంటాయి. పల్నాడు ముఖద్వారం అయిన గురజాల నియోజకవర్గంలో మరోసారి పాత ప్రత్యర్థులే పోటీపడుతున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి.. టీడీపీ నుంచి సీనియర్ నేత య‌రపతినేని శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. కాసు మహేష్ రెడ్డి రెండోసారి ఎన్నికల బరిలో ఉంటే.. య‌రపతినేని గురజాల నుంచి వరుసగా ఏడోసారి పోటీ చేస్తున్నారు.

గత ఎన్నికలలో జగన్ ప్రభంజనంలో నాన్ లోకల్ అయినా కాసు మహేష్ రెడ్డిని గురజాల ప్రజలు గెలిపించారు. నియోజకవర్గంలో అభివృద్ధి కన్నా ఆధిపత్య రాజకీయాలు.. దందాలు చేసిన కాసు మహేష్ రెడ్డి పై తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగానే ఎంతోమంది బీసీలను వైసీపీ వైపు మళ్లేలా చేసిన పార్టీ సీనియర్ నేత, బీసీ నేత ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని సైతం రాజకీయంగా కాసు అణగదొక్కేశారు. దీనిని ఖండించాల్సిన జగన్ సైతం సొంత సామాజిక వర్గానికి చెందిన కాసు మహేష్ రెడ్డికే వత్తాసు పలకడంతో గతంలో వైఎస్ నుంచి.. నేడు జగన్ వరకు.. ఆ ఫ్యామిలీ వెంట నడిచిన జంగా తీవ్ర మనస్థాపానికి గురై పార్టీ నుంచి బయటికి వచ్చేసారు. చివరకు తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి య‌రపతినేని శ్రీనివాసరావును గెలిపించాలని జంగా కంకణం కట్టుకున్నారు.

కాసు మహేష్ తీరుతో నియోజకవర్గంలో బీసీలు అందరూ ఇప్పటికే దూరమవుతున్నారు. అదే సమయంలో కాసు అటు సొంత సామాజిక వర్గంలోనూ.. ఐదారు గురు నేతలను మినహాయిస్తే ఎవరికీ పనులు చేయలేదని.. ఆయన వల్ల ఎవరికి న్యాయం జరగలేదన్న చర్చలు సొంత పార్టీ నేతలోనే ఉన్నాయి. వైసీపీకి సంప్రదాయంగా పడే ఓట్లు మినహా చాలామంది ఇప్పటికే కాసుకు దూరం జరిగి పోయారు. గత ఎన్నికలలో నాన్ లోకల్ అయినా కాసును గెలిపిస్తే నియోజకవర్గం పార్టీని నాశనం చేయడంతో పాటు.. బీసీలను జంగా లాంటి కీలక నేతను సైతం దూరం చేసుకున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈసారి పిడుగురాళ్ల పట్టణంలో బలంగా ఉన్న వైశ్య సామాజిక వర్గంతో పాటు నియోజక వర్గంలో ఉన్న బలిజ సామాజిక వర్గం వారంతా య‌రపతినేని వైపు.. ఇంకా చెప్పాలంటే కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు. గత ఎన్నికలలో తన కెరీర్‌లో ఫస్ట్ టైం భారీ తేడాతో ఓడిపోయిన య‌రపతినేని ఐదేళ్లుగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోనే ఉన్నారు. ఈసారి ఎన్నికలకు ముందే ఆయనకు అనుకూల వాతావరణం కనిపిస్తోంది. ప్రచారంలో ఆయన ఇద్దరు వార‌సులు గట్టిగా తిరుగుతున్నారు. ఏది ఏమైనా ఈసారి పల్నాటి యుద్ధం లో గత ఎన్నికలతో పోలిస్తే అంచనాలు తారుమారు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: