పేదల చదువుకు ఎంత ఖర్చయినా భరిస్తాం : సీఎం జగన్

Reddy P Rajasekhar

ఏపీ సీఎం జగన్ విజయవాడలో పూలే 129వ వర్ధంతి సభలో జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీఎం జగన్ మాట్లాడుతూ చదువు విషయంలో, అంటరానితనం విషయంలో, మహిళలు చదువుకోవాలనే విషయంలో జ్యోతిరావు పూలే పోరాటం చేశారని జగన్ చెప్పారు. ఆడవాళ్లు ఎవరూ చదువుకోకూడదని, ఆడవారు వంటింటికే పరిమితం కావాలని కట్టుబాట్లు ఉన్న రోజుల్లో ఆ కట్టుబాట్లను వ్యతిరేకించి తన భార్యను చదివించడమే కాకుండా టీచర్ గా పూలే గారు చేశారని జగన్ అన్నారు. 
 
పేదవాడు పేదరికం నుండి బయటపడాలంటే ఆ కుటుంబం నుండి ఒక్కరైనా ఇంజనీర్, డాక్టర్, కలెక్టర్ కావాలని దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కోరుకున్నారని జగన్ చెప్పారు. బీసీలంటే బ్యాక్ వార్డ్ క్లాసులు కాదని బ్యాక్ బోన్ క్లాసులుగా వీరందరినీ మార్చాలని తపన, తాపత్రయంతో బీసీ డిక్లరేషన్ కార్యక్రమం చేశామని జగన్ అన్నారు. ఒక మాటంటూ ఇస్తే ఆ మాటను నిలబెట్టుకోవాలనే తపన, తాపత్రయంతో మేనిఫెస్టోను డిజైన్ చేశామని జగన్ అన్నారు. 
 
రెండే రెండు పేజీల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించామని ఈ మేనిఫెస్టో చూస్తే ఇందులో చెప్పిన ప్రతి పథకానికి అడుగులు ముందుకు పడ్డాయో లేదో తెలుస్తుందని జగన్ అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 60 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మంత్రివర్గంలో చోటు ఇచ్చామని జగన్ అన్నారు. నా మంత్రివర్గంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలను తీసుకున్నామని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చెందిన వారిని డిప్యూటీ సీఎంలుగా తీసుకున్నామని జగన్ అన్నారు. 
 
బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు 50 శాతం ఖచ్చితంగా నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల్లో ఇవ్వాలని చట్టం తీసుకొనివచ్చామని జగన్ అన్నారు. ప్రతి అడుగులోను విప్లవాత్మకు మార్పుకు శ్రీకారం చుడుతున్నామని జగన్ అన్నారు. పేద విద్యార్థుల చదువుకు ఎంత ఖర్చయినా భరిస్తామని జగన్ స్పష్టం చేశారు. ఉద్యోగాలు ఏపీలో పోవడం కాదు వచ్చిన పరిస్థితి నెలకొందని జగన్ అన్నారు. 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: